సినిమా ఇండస్ట్రీలో రాణించి ప్రేక్షకుల గుర్తింపు పొంది నిలదొక్కుకోవడం ఎంత కష్ట మో ఆ తరువాత కెరీర్ నీ కొనసాగించడం కూడా అంతే కష్టం. చాలా మంది హీరోలు కెరీర్ తొలినాళ్లలో రెండు మూడు సినిమాలతో సూపర్ హిట్ కొట్టి ఆ తరువాత కథల ఎంపికలో క్లారిటీ లేకుండా చేసుకుని తమ కెరీర్ నీ చేజేతులా నాశనం చేసుకుంటూ ఉంటారు. ట్రెండ్ కు తగ్గట్టు అప్డేట్ అవకుండా వారు చేసే చిన్న చిన్న పొరపాట్లే వారి భవిష్యత్తు పై ప్రభావం చూపుతూ ఉంటాయి.

ఆ విధంగా తన కెరీర్ మొదట్లో మంచి సినిమాలతో వచ్చిన రోహిత్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకుందాం. రెండు దశాబ్దా ల క్రితం తెలుగుతెరపై ఓ వెలుగు వెలిగిన నటుడు రోహిత్. యూత్ ఫుల్ సినిమాలతో యువతను తెగ అట్రాక్ట్ చేసి మంచి హీరోగా నిలదొక్కుకున్నాడు. 16 టీన్స్ లాంటి సూపర్ హిట్ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రోహిత్ ఆ తర్వాత వరుసగా మంచి అవకాశాలు వచ్చాయి అయినా కూడా తెలుగు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోలేక పోయాడు.

తెలుగు సినిమా పరిశ్రమకు మెల్ల మెల్లగా దూరమయ్యాడు రోహిత్. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పా రు. తన కెరీర్ ప్రారంభంలో మంచి సినిమాలు చేశాను. ఆ సినిమాలతో డబ్బులు కూడా బాగానే సంపాదించాను అయితే వాటిని పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం తో ఆ వ్యాపారాలలో అనుకున్నంత  లాభాలు పొందకపోవడం తో నే ను సంపాదించినదంతా అక్కడ పోగొట్టుకున్నను అని చెప్పాడు రోహిత్. కర్నూలు జిల్లా రాజకీయాల్లోకి రావాలని పలువురు రాజకీయ నాయకుల నుంచి పిలుపు వచ్చింది అని చెప్పాడు. అయితే ఆ ఆహ్వానాల ను తిరస్కరించినట్లు గా చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: