బాలీవుడ్ అందాల నటి దిశాపటాని పుట్టినరోజు నేడు. తన గ్లామర్ తో బాలీవుడ్ జనాల ను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఉత్తరాఖండ్ నుంచి వచ్చి తన పరువాలతో అందరినీ అలరిస్తుంది. 1992లో జూన్ 13న జన్మించిన ఈమె చిన్నతనం నుంచే మోడల్ గా రాణించాలని కలలు కంది. ఈ క్రమంలోనే ఆమె కొన్ని మోడల్ షోలలో పాల్గొని తన అందంతో అందరిని ఆకర్షించి తెలుగు సినిమా పరిశ్రమలో లోఫర్ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది దిశాపటాని.

తన లేత పరువాలను చూపిస్తూ అందాల విందు చేసింది. తెలుగు లో ఈమెకు స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అనుకునేలోపే బాలీవుడ్ కి చెక్కేసింది ఈ సన్నని భామ. మహేంద్రసింగ్ ధోని బయోగ్రఫీ ఎంఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ లో ఈమె హీరోయిన్ గా చేసి ఆమె బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన కుంగ్ ఫు యోగ , వెల్కమ్ టూ న్యూ యార్క్, భాగీ 2, భారత్ సినిమాలు ఆమెకు స్టార్ట్ అయ్యే అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. ఆ సినిమాల్లో ఆమె పంచిన గ్లామర్ కు బాలీవుడ్ జనాలు ఫిదా అయిపోయారు.

హీరోలు సైతం ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేయాలంటూ దర్శకులపై నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఈమె తొలి సినిమాతోనే  నాలుగు అవార్డులు అందుకని మంచి ప్రేక్షకాదరణ పొందింది. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన కొత్త కొత్త ఫోటోలను అప్డేట్లను వాటిలో వెల్లడిస్తూ ప్రేక్షకులను మైమరపింప చేస్తున్నారు. అయితే ఆమె మరో తెలుగు సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. లోఫర్ తర్వాత ఆమె దాదాపు ఆరు సంవత్సరాల వరకు తెలుగులో సినిమా చేయలేదు. ఇప్పటికైనా ఆమె తెలుగులో మరో సినిమా చేసి తన అభిమానులను హ్యాపీ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: