నందమూరి బాలకృష్ణ ఇటీవలే తన పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆయన పుట్టిన రోజు నాడు బాలయ్య ఫాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా వేదికగా ఆయన పుట్టిన రోజును ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. తెలుగు సినిమా హీరో లలోనే ప్రత్యేక శైలి, పద్ధతి పాటించే నందమూరి బాలకృష్ణకు తెలుగు నాట భారీ క్రేజ్ ఉంది . ఆ క్రేజ్ తోనే ఆయన చేసిన ప్రతి సినిమాని సూపర్ హిట్ అయ్యేలా చూసుకుంటారు.

ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేస్తున్న, చేయబోయే సినిమాల అప్డేట్ లతో సోషల్ మీడియా మారుమోగిపోయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే మూవీ బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేయగా అఖండ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. థియేటర్స్ ఓపెన్ అవగానే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

సినిమా తర్వాత వెంటనే గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తాడు బాలకృష్ణ. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి క్రాక్ మూవీ కి పని చేసిన టీం వర్క్ చేయబోతోందట. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతోందట. ఇక దీంతోపాటు మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్యసినిమా చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.  పూరిజగన్నాథ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు ప్రచారం అవుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పైసా వసూల్ పెద్దగా ఆడలేదు దాంతో మళ్లీ ఆయనతో సినిమా చేయాలని పాన్ ఇండియా రేంజ్ సబ్జెక్ట్ రెడీ చేశాడట పూరి. ఇలా వరుస సినిమాలతో బాలయ్య బాబు ఫుల్ జోష్ లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: