తెలుగు సినిమా ప్రేక్షకులకి ఫామిలీ సినిమాలు అంటే ఆదరణ చాలా ఎక్కువ. అలా తెలుగులో చాలా గుర్తుండిపోయే సినిమాలు వస్తుంటాయి. అందులో సిద్దార్ధ నటించిన బొమ్మరిల్లు సినిమాకి ప్రత్యేక స్థానం ఉంటుంది . భాస్కర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం గత 20 సంవత్సరాలలో వచ్చిన ఫ్యామిలీ సినిమాల్లో  ముందంజలో ఉండటం ఖాయం.

సినిమా దిల్ రాజు కెరీర్ లో అలాగే హీరో సిద్దార్ధ కెరీర్ లో  ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ సినిమాతోనే డైరెక్టర్ భాస్కర్  పరిచయమయ్యాడు అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఈ సినిమా అసలు మొదటి సినిమా డైరెక్టర్ తీసినట్టు .అప్పటిదకా యంగ్ హీరోగా ఉన్న సిద్ధార్థ్ ని బొమ్మరిల్లు సినిమా స్టార్ హీరోని చేసింది. 2006లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా అవార్డులు కూడా దక్కించుకుంది.


అయితే  ఈ సినిమాలో హీరోగా ముందుగా సిద్ధార్థ్  కంటే ముందు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లకు ఈ కథ చెప్పాడంట బొమ్మరిల్లు భాస్కర్. కానీ ఎందుకో ఇద్దరికి ఈ సినిమా కథ నచ్చలేదు.కానీ అల్లు అర్జున్ కి బొమ్మరిల్లు భాస్కర్ కథ చెప్పిన పద్ధతి నచ్చింది అందుకే వెంటనే బొమ్మరిల్లు భాస్కర్ తో పరుగు సినిమాని లైన్ లో పెట్టాడు అల్లు అర్జున్.ఈ సినిమాకి మొదటి వేరే టైటిల్స్ చాలానే అనుకున్న కూడా  బొమ్మరిల్లు టైటిల్ ని దిల్ రాజు ఫైనల్ చేశాడు. 120 రోజుల షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేయగా భాస్కర్  105 రోజుల్లోనే పూర్తి చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా  7 కోట్లతో తెరకెక్కిస్తే 25 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ ని షాక్ చేసింది.అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక హాసినిగా జెనీలియా చేసిన పర్ఫార్మెన్స్ అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఈ సినిమాలో ప్రతి పాట అప్పటినుంచి ఇప్పటికి చార్ట్ బస్టరే .

మరింత సమాచారం తెలుసుకోండి: