టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా వెలుగొందుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. రాజమౌళి తెరికెక్కించిన బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ప్రభాస్ ని ఇష్టపడే వారిలో యూత్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉన్నారు.గతంలో ప్రభాస్ నటించిన 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని తెగ ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమాతోనే ప్రభాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి మొదటిసారి దగ్గరయ్యాడు.2011 లో విడుదలైన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. సీనియర్ దర్శకుడు దశరథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.ప్రభాస్ కి జోడిగా కాజల్ అగర్వాల్, తాప్సి కథానాయికలుగా నటించారు.

దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఆ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.అంతేకాదు ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అయితే అప్పట్లో ఈ సినిమాపై ఓ కాపీ వివాదం కూడా చుట్టుకుంది.అప్పట్లో ఈ సినిమా కథను"నా మనసు కోరింది నిన్నే" అనే నవల నుండి కాపీ కొట్టారంటూ ప్రముఖ రచయిత్రి శ్యామలా దేవి ఏకంగా కోర్టుకు వెళ్ళింది.2019 లోకోర్టు ఆదేశాల మేరకు 4117/2018 గాఛార్జ్ షీట్ నమోదు చేసి..చిత్ర నిర్మాత దిల్ రాజుకు మాదాపూర్ పోలీసులు సమన్లు పంపారు.ఆ తర్వాత కోర్టు విచారించి.. ఆ సినిమా శ్యామలా దేవి నవల నుంచి కాపీ కొట్టినట్లు నిర్ధారించింది.

ఇక కేసు గెలిచిన శ్యామలా దేవి చిత్ర నిర్మాతల నుండి నష్టపరిహారం అడిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.అలా ఆ వివాదం కోర్టు వరకు వెళ్లి.. ఆ తర్వాత మెల్ల మెల్లగా సర్దుమణిగింది. అయితే అప్పట్లో ఈ వివాదాన్ని దిల్ రాజు ఎక్కువగా బయటికి రానివ్వలేదు.అందుకే చాలామందికి ఈ వివాదం గురించి తెలియదు.అలా ఈ సినిమాకి పలు వివాదాలు చుట్టుకున్నా.. సినిమా మాత్రం ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి.. డార్లింగ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది.ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు.తాజాగా 'రాధే శ్యామ్' సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ తో 'సలార్' సినిమాను కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు ఈ హీరో..!!

మరింత సమాచారం తెలుసుకోండి: