టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో పంచదార బొమ్మ కాజల్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేయడంతో పాటు తనదైన నటన, డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అమ్మడి అందాలకు, నటనకు తెలుగు సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. అభిమానులు అమ్మడి సినిమా అంటే థియేటర్ల ముందు వాలిపోతారు. అయితే ప్రస్తుతం కాజల్ ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోంది. అంతేకాకుండా ఇతర భాషల్లోనూ వరుస సినిమాలను ఓకే చేసింది. అంటే ప్రస్తుంత కాజల్ ఫుల్ బిజీ అని తెలుస్తోంది.
ఇంత బిజీగా ఉంటూ కూడా కాజల్ మరిన్ని అవకాశాలను ఓకే చేస్తుంది. ఎన్‌టీఆర్ త్రిపాత్రభినయం చేసిన జైలవకుశ సినిమా ‘పక్కా లోకల్ నేను పక్కా లోకల్’ అంటూ కుర్రకారుని ఓ ఊపుఊపేసిన కాజల్, మరో సారి భారీ డాన్స్ చేసేందుకు సిద్దమవుతుందట. అయితే ఈ సారి స్టార్ హీరో సినిమాలో కాదు, ఓ యంగ్ హీరో సినిమాలో కాజల్ ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఉప్పెన సినిమాతో తెలుగునాట మంచి గుర్తింపు అందుకున్న వైష్ణవ్ తన రెండో సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ సినిమాలోనే కాజల్ స్పెషల్ పాటకు స్పెషల్ డాన్స్ చేయనుందట, ఇందుకోసం కాజల్‌ను క్రిష్ సంప్రదించగా అమ్మడు వెంటనే ఓకే చెప్పిందట. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినీ వర్గాల నుంచి కూడా ఈ వార్త పక్కా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కాజల్ స్పెషల్ సాంగ్ గురించి క్రిష్ త్వరలో ఏమైన ప్రకటిస్తాడేమో చూడాలి.
అంతేకాకుండా ఈ పాటలో అదిరిపోయే డాన్స్ ఉండనుందని, అందుకోసం కాజల్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుందని టాక్ నడుస్తోంది. ఈ శిక్షణ మరికొన్ని రోజుల్లో పూర్తవుతుందట, అది పూర్తయిన వెంటనే కాజల్ తన పాటకు కావలసిన ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే గనుక నిజమయితే ఇక అమ్మడి అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. దీనిపై త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: