త్రివిక్రమ్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫ్యాక్షన్ మేనియాలో కొట్టుకుపోతున్న టాలీవుడ్ ఇండస్ట్రీని తట్టిలేపిన దర్శకుడు త్రివిక్రమ్. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడానికి యాక్షన్ అవసరం లేదు 4,5 పంచు డైలాగులు ఉంటే సరిపోతుంది అని నిరూపించిన దర్శకుడు త్రివిక్రమ్.  తన కలానికి పదును పెట్టి తన మాటలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి.. ఇండస్ట్రీ హిట్లు కొట్టిన దర్శకుడు త్రివిక్రమ్ . ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న స్టార్ డైరెక్టర్  లలో త్రివిక్రమ్ ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందరిలా కాకుండా భిన్నంగా స్క్రిప్టు రెడీ చేసి ఇక హీరోయిజం ఎలివేట్ చేసే విధంగా డైలాగులను రాసుకొని.. హీరోయిజం అంటే ఫ్యాక్షన్ మాత్రమే కాదు అసలు సిసలైన హీరోయిజం అంటే మాటలతో మెప్పించడమే అని  నిరూపించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.



 ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా ఇటీవల టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించిన అలా వైకుంఠపురం లో  సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అయితే ఏ సినిమా తెరకెక్కిస్తున్న...  త్రివిక్రమ్ తనదైన టేకింగ్ తో అదరగొట్టాడు. సాధారణంగా ఇతర దర్శకుల సినిమాల్లో కేవలం 2,3 మాత్రమే పంచ్ డైలాగులు ఉంటాయి. కానీ త్రివిక్రమ్ సినిమాలో ప్రతి డైలాగ్ పంచు డైలాగ్ లాగే ఉంటుంది. అయితే కొన్నేళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు త్రివిక్రమ్.




 ఇక ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగు పెట్టేందుకు దర్శకుడు త్రివిక్రమ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో తన మాటలతో మాయ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు త్రివిక్రమ్. ఇక ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టబోతున్నాడట. సినిమా నిర్మాణ రంగం కాస్త రిస్క్ అని తెలిసినప్పటికీ నిర్మాతగా అవతారమెత్తి ఒక సినిమాను నిర్మించే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో త్రివిక్రమ్ నిర్మాతగా మారబోతున్నారట. ఈ సినిమాకు పెట్టుబడి పెట్టి ఇక సినిమాను నిర్మించే ఆలోచనలో మాటల మాంత్రికుడు ఉన్నట్లు తెలుస్తోంది.  అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అటు టాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రం ఈ గాసిప్ ఊపేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: