ఒకవైపు కరోనా శాండిల్ వుడ్ ని టెన్షన్ పెడుతుంటే మరో పక్క ఆ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో నటుడు సంజయ్ విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. విజయ్ తల, కుడి చేయికి తీవ్ర గాయాలయ్యాయని అంటున్నారు. ఆయన స్నేహితులతో బైక్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ ప్రమాదం కారణంగా మెదడు యొక్క భాగంలో తీవ్రమైన రక్తస్రావం జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఐసియులో చికిత్స అందిస్తున్నారు. ఇక విజయ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది మరియు అతను బన్నేర్ ఘట్ట రోడ్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 


జెపి సిటీలోని 7వ ఫేజ్ ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇక విజయ్ తన స్నేహితుడు నవీన్‌తో కలిసి వెళుతున్న సమయంలో విజయ్ బైక్ నడుపుతున్నాడు. ప్రమాదం జరగడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. విజయ్ ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి అలాగే ఏవైనా ఎమర్జెన్సీ అయితే చూసుకోవడానికి నటుడు సతీష్ నీనసం ఆసుపత్రిలోనే ఉన్నారు. తాను బైక్ స్కిడ్‌ కావడం వలనే పడిపోయానని నవీన్ పేర్కొన్నాడు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. 


మెదడులో రక్తం గడ్డకట్టినందున నటుడి ఆరోగ్య పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని సంచారి విజయ్ న్యూరో సర్జన్ మీడియాతో అన్నారు. వైద్యులు శస్త్రచికిత్స చేయబోతున్నా రాబోయే 48 గంటలు క్లిష్టమైనవని అంటున్నారు. సంచారి విజయ్ 2015 లో కన్నడ చిత్రం నాను అవనాల్లా అవలుకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును గెలుచుకున్నారు. లాక్డౌన్ అంతా విజయ్ మరియు అతని బృందం COVID రోగులకు ఆక్సిజన్ అలాగే ఇతర కోవిడ్ సేవలు అందించారు. సంచారి విజయ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, శాండిల్ వుడ్ శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: