పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ సంగతి అందరికి తెలిసిందే. ఇక ఆయనకున్న ఫ్యాన్స్ లో మేజర్ గా అమ్మాయిలు ఎక్కువగా ఫ్యాన్స్ గా ఉన్నారు. వారికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అనేలా చాలా ప్రేమ ఉంది. ప్రేక్షకులే కాదు ఆయనకు టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ గా ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్ లు ఆయన అంటే పడి పడి చస్తారు. ఆయనతో ఎలాగోలా స్క్రీన్ పంచుకుంటే చాలు అనుకునే హీరోయిన్ లు, పక్కన నిల్చుంటే చాలు అనుకునే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు.

ఆ విధంగా పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చే ఆ ముద్దుగుమ్మలెవరో ఇప్పుడు చూద్దాం. తెలుగులో పలు సినిమాలు తీసి మంచి పేరుపొందింది పూనమ్ కౌర్.  ఈమెకు పవన్ అంటే మహా పిచ్చి. తనతో కలిసి సినిమా చేయాలని చాలా ప్రయత్నించింది కానీ కుదరలేదు. నిజానికి జల్సా సినిమాలో పార్వతి మెల్టన్ పాత్రను చేయాలి కానీ ఆమెను దూరం పెట్టాడు త్రివిక్రమ్. ఆ విషయాన్ని పలుమార్లు చెప్పింది పూనం. పవన్ తో విభేదాలకు కారణం కూడా మాటల మాంత్రికుడు అని ఆరోపించింది. నచ్చావులే సినిమాతో తెలుగు తెర మీదకు వచ్చిన హీరోయిన్ మాధవి లత మీటు ఉద్యమ సమయంలో క్యాస్టింగ్ కౌచ్ పై తీవ్ర విమర్శలు చేసింది.

అయితే ఈ అమ్మాయికి పవన్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం ఉండేదట. అంతేకాదు పవన్ మీద ఈగ వాలకుండా చూసుకుంటూ ఉంటుంది. శ్రీ రెడ్డి విషయంలో పవన్ కు మద్దతుగా రోడ్డెక్కింది ఈ హీరోయిన్. బిగ్ బాస్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆశు రెడ్డి రెడ్డి కి కూడా పవన్ అంటే యమ పిచ్చి. మొత్తంగా ఈమెను పవన్ నాలుగో భార్యను చేశారు నెటిజన్లు. ఓ షూటింగ్ లో పవన్ ను కలిసిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టింది.  దీంతో వీరిద్దరి కి లింకు పెట్టేసారు సోషల్ మీడియా జనాలు. అభిమానంతో తనకు భార్య ఉండడానికి కూడా ఇష్టమే అని చెప్పడం ఈ వార్తలకు బలం చేకూర్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: