టాలీవుడ్ టాప్ హీరో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు వరసపెట్టి చేస్తున్నారు. ఆయన రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ సృష్టించిన సంచలనం గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవన్ చేతిలో ఇపుడు దాదాపుగా అరడజన్ సినిమాలు దాకా ఉన్నాయి.

అయితే గత రెండేళ్ళుగా  కరోనా మహమ్మారి వదలకుండా టాలీవుడ్ ని పట్టి పీడించడంతో ఎక్కడికక్కడ షెడ్యూల్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. నిజానికి ఈపాటికి పవన్ సినిమాలు కనీసం మూడు అయినా రిలీజ్ కావాల్సి ఉండేది. అదే సమయంలో మరో నాలుగైదు సినిమాలు 2022 నాటికి పూర్తి చేయాలని కూడా పవన్ గట్టిగా నిర్ణయించుకున్నారు. కానీ కరోనా కారణంగా పుణ్యకాలమంతా అలా కరిగిపోయింది. దాంతో పవన్ ఇపుడు కొత్త ఆలోచనలు చేస్తున్నారు అన్న మాట వినిపిస్తోంది.

అదేంటి అంటే తాను కమిట్ అయిన సినిమాలే చేసి తిరిగి రాజకీయాల్లో బిజీ కావాలని. పవన్ ఇపుడు అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ చేస్తున్నారు. అదే విధంగా క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది మరో రెండు మూడు సినిమాలు చేయడానికి పవన్ చూస్తారని అంటున్నారు. ఆ జాబితాలో హరీష్ శంకర్ మూవీ కూడా ఉందని అంటున్నారు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కూడా చేసిన మీదట 2023 జనవరి నుంచి తిరిగి రాజకీయ తెరకు షిఫ్ట్ కావాలని పవన్ భావిస్తున్నారు అంటున్నారు.

అంటే పవన్ ఎంత చేసినా 2022 డిసెంబర్ దాకానే అంటున్నారు. 2024 మే లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి కాబట్టి దానికి సరిగ్గా ఏడాది ముందుగా రాజకీయాలలో  బిజీ కావాలని పవన్ గట్టిగా నిర్ణయించుకున్నారు అన్న టాక్ అయితే వినిపిస్తోంది. అదే కనుక జరిగితే పవన్ తో సినిమాలు తీయాలని ఆశలు పెట్టుకున్న అనేక మంది నిర్మాతలు షాక్ తిన్నట్లే అంటున్నారు. మొత్తానికి పవన్ రీ ఎంట్రీ తరువాత నాలుగైదు సినిమాలు వస్తాయని భావించవచ్చేమో.




మరింత సమాచారం తెలుసుకోండి: