నందమూరి అందగాడు బాలక్రిష్ణ మళ్లీ జోరు చేస్తున్నారు. వరసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నారు. అంతే కాదు ఈసారి తన రూట్ మార్చేశారు. మంచి బ్యానర్ల తో పాటు సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతో బాలయ్య జత కడుతున్నారు. ఇది ఒక విధంగా ఫ్యాన్స్ కి ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు. బాలయ్య గతంలో సరైన కాంబోని చూసుకోకుండా సినిమాలు చేసి ఫ్లాప్స్ తెచ్చుకున్నారని కూడా చెబుతారు.

ఇపుడు బాలయ్య ఆలోచనా విధానం కూడా మారింది. దానికి తగినట్లుగా నిర్మాతలు దర్శకులు కూడా ఆయన్ని కోరుకోవడంతో మరి కొన్నాళ్ళు టాలీవుడ్ తెర మీద బాలయ్య నట విశ్వరూపాన్ని చూసే అవకాశం ఫ్యాన్స్ కి దక్కుతోంది. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్యకు నటనతో పాటు మరో కోరిక కూడా ఉంది. అదే డైరెక్షన్ చేయాలన్నది. బాలయ్య తాను సోలో హీరోగా 80 దశకంలో ఎంట్రీ ఇచ్చినపుడే దర్శకత్వం చేస్తానని ప్రకటించారు.

ఆయన నాడు అనుకున్న ప్రాజెక్ట్ గౌతమ బుద్ధ. బాలయ్యకు బుద్ధిడి పాత్ర పోషించాలని ఎంతో ఆశ ఉండేది. అయితే ఆ తరువాత కాలంలో ఎన్టీయార్ సామ్రాట్ అశోక్ మూవీలో బుద్ధుడిగా పాత్ర పోషించేశారు. ఇక బుద్ధుడి మీద ఒకటి రెండు సినిమాలు కూడా వచ్చేశాయి. దాంతో బాలయ్య మనసు మార్చుకుని నర్తక శాల అంటూ పౌరాణిక కధ వైపు మళ్లారు. 2004లో ఆ సినిమా షూటింగ్ జరిగితే ద్రౌపది పాత్ర పోషించిన సౌందర్య అకాల మరణంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది.

అయినా బాలయ్యలో దర్శకత్వం చేయాలన్న కోరిక అలాగే ఉంది. రీసెంట్ గా ఆయన ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ తనకు అవకాశం వస్తే ఆదిత్య 369 మూవీ సీక్వెల్ ని తానే డైరెక్ట్ చేస్తాను అని చెప్పారు. దాంతో ఫ్యాన్స్ హుషార్ గా ఉన్నారు. బాలయ్యకు దర్శకత్వ శాఖలో అనుభవం ఉంది. ఆయన తన తండ్రి ఎన్టీయార్ తీసిన అనేక సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. పైగా వంద చిత్రాలల్లో హీరోగా నటించిన బాలయ్యకు అన్ని శాఖల మీద పట్టుంది. దాంతో తాను డైరెక్షన్ చేసి చూపిస్తాను అంటున్నారు. మరి ఆ మంచి రోజు కోసమే ఫ్యాన్స్ ఎదురుచూస్తుననరు. బాలయ్య కోరిక తీరాలని వారు కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: