ప్రతి సినిమా పరిశ్రమలో ప్రతి నటుడికి కూడా తన కెరీర్‌లో గుర్తుండిపోయే, జీవితాన్ని మలుపు తిప్పే చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి చిత్రాలలో అగ్ర కథానాయకుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌కు ఊతం ఇచ్చిన చిత్రం ‘పున్నమినాగు’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా రాజశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక నరసింహరాజు, చిరంజీవి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలై ఈరోజుతో సరిగ్గా 41 ఏళ్లు(జూన్‌ 13, 1980) పూర్తి చేసుకుంది. కన్నడ పరిశ్రమలో ఘన విజయం సాధించిన ‘హున్నిమియే రాత్రియాళి’ అనే చిత్రానికి ‘పున్నమినాగు’ సినిమా రీమేక్‌ కావడం విశేషం. ఇక ఈ సినిమాకి రాజశేఖర్‌ టేకింగ్‌, కె.చక్రవర్తి సంగీతం ప్రాణం పోశాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి, నరసింహరాజు, రతి అగ్నిహోత్రిల నటన సినిమాను విజయ పథంలో నడిపింది.


ఇక పున్నమినాగులో మెగాస్టార్ చిరంజీవి పోషించిన నాగులు పాత్ర ఒకరకంగా సవాల్‌తో కూడుకున్న పాత్రనే చెప్పాలి. అప్పుడే ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి బయటకు వచ్చిన చిరంజీవికి చిత్ర పరిశ్రమలో పెద్దగా అనుభవం లేదు. ఇక ఈ సినిమాలో పాము లక్షణాలున్న వ్యక్తిగా చిరంజీవి డిఫరెంట్ షేడ్స్‌ చూపించాలి. ఒక విలక్షణమైన నటుడిగా తనని తాను సిద్ధం చేసుకుని నాగులు పాత్రలో ఒదిగిపోయి నటించారు మెగాస్టార్.అలాగే సంభాషణలు పలికే తీరు, డ్యాన్స్‌లతో యువతను విశేషంగా ఆకట్టుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి.అలాగే ఈ సినిమా క్లైమాక్స్‌లో చిరు పాము లక్షణాలున్న మనిషి అని తెలిసిన తర్వాత హీరో నరసింహరాజు అతడిని పారిపోమ్మంటాడు. ఆ సన్నివేశంలో ‘ఎక్కడికి పోవాలి.పోతే పుట్టలోకే పోవాలి’ అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఆ డైలాగ్ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తుంది.ఇక ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరచిపోలేని సినిమాగా ఒక మాస్టర్ పీస్ చిత్రంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: