సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ల కలయికలో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో మహేష్ కి జోడీగా సమంత నటించగా, వెంకీ సరసన హీరోయిన్ గా అంజలి యాక్ట్ చేసింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ నటి రోహిణి హట్టంగడి, రావు రమేష్, కల్పిక గణేష్, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించారు.

ఇక 2013లో సంక్రాంతి కానుకగా మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో మహేష్ చిన్నోడు గా అలానే వెంకీ పెద్దోడు గా ఒకరిని మించేలా మరొకరు ఎంతో అద్భుతంగా నటించారు అనే చెప్పాలి. సినిమాలో మహేష్, వెంకటేష్, ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే సీన్స్ తో పాటు ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ హృద్యంగా ఉండడంతో పాటు అందరి మనసుని తాకుతాయి. వాస్తవానికి ఈ సినిమాలో మహేష్ స్థానంలో పవన్ కళ్యాణ్ నటించాల్సిందని అప్పట్లో వార్తలు ప్రచారం అయ్యాయి. అలానే చాలా ఏళ్ళ తరువాత టాలీవుడ్ లో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఇదే అని చెప్పాలి.

అంతకముందు కూడా పలు మల్టీస్టారర్ మూవీస్ వచ్చినప్పటికీ అవి చిన్న, పెద్ద హీరోల కలయికలో తెరకెక్కాయి. ఇక ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ అందించిన సాంగ్స్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్రీకాంత్ అడ్డాల అద్బుతమైన టేకింగ్, సమంత, అంజలిల అందం అభినయం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పాత్ర ఈ మూవీకి ప్రధానాకర్షణ గా నిలిచాయని చెప్పాలి. మనుషులు అందరూ మంచివారే అంటూ అందరి విషయంలో ఎంతో పాజిటివ్ గా వ్యవహరించే ఆయన పాత్ర ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మొత్తంగా సీతమ్మ వాకిట్లో మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఎంతో అలరించిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో ఒకటి అనే చెప్పాలి .... !!

మరింత సమాచారం తెలుసుకోండి: