బుల్లితెరపై మాటీవీలో ప్రసారం అవుతున్న 'జానకి కలగనలేదు' సీరియల్ తక్కువ సమయంలోనే టాప్ రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఈ సీరియల్ లో హీరోగా అమర్ దీప్ చౌదరి నటిస్తున్నాడు. తన నటనతో ప్రేక్షకులను ఎంతగో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పటివరకు 'జానకి కలగనలేదు' సీరియల్ 60 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. తాజాగా అమర్ దీప్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ తరుణంలో అమర్ దీప్ తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పి యూత్ కి ఓ మెసేజ్ తెలిపాడు. అంతేకాదు..తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పిన అమర్ తన లైఫ్ లో కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉందని చెప్పుకొచ్చాడు.

అయితే లవ్ ఫెయిల్యూర్ అంటే ఇద్దరిలోనూ మిస్టేక్ ఉంటుందని... లవ్ ఫెయిల్ అయ్యిందని అన్నారు. ఇక అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని పగలు కోపాలు పెంచుకోవడం లాంటివి కరెక్ట్ కాదని అన్నారు. అయితే లవ్‌లో ఫేక్ ప్రామిస్‌లు ఉండకూడదని.. వాళ్లలో లేనిపోని ఆశల్ని కలిగించకూడదని చెప్పుకొచ్చాడు. ఇక అప్పటి వరకు కలిసి ఉండి ఆ తర్వాత హ్యాండ్ ఇస్తే అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా తట్టుకోలేరని వీక్ హార్ట్ అయితే చచ్చిపోతాడు.. లేదంటే చంపేస్తాడని ఆయన అన్నారు.

ఇక ఏడిస్తే అమ్మాయి తిరిగి వస్తుందనుకుంటే.. ఎన్నాళ్లైనా ఏడవవ‌చ్చని అన్నారు. కానీ.. రాదు అని తెలిసినప్పుడు వదిలేయాల‌నీ అమర్ దీప్ చెప్పుకొచ్చాడు. అయితే అమ్మాయిల్లో ఓ విషయాన్ని గమనించాను.. వాళ్లు వద్దు అనుకుంటే కనీసం వెనక్కి తిరిగి కూడా  చూడరని అన్నారు. అంతేకాదు.. ఒక్కసారి మనసు విరిగిపోయిందంటే ఏం చేసినా అతుక్కోదు.. మళ్లీ మనవైపు చూడరు.. అలాంటప్పుడు నిన్ను నువ్వు బాధపెట్టుకోవడం.. ఇంట్లో వాళ్లని బాధపెట్టడం.. ప్రేమించిన అమ్మాయిని బాధపెట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉండదని అమర్ దీప్ చెప్పుకొచ్చాడు. ఇక తన జీవితంలో ఇలాంటి అనుభవం ఎదురైంది కాబట్టి చెబుతున్నానని.. త‌న‌ బ్రేకప్ స్టోరీ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: