అక్కినేని సమంత.. ఈ పేరుకు తెలుగు నాట పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు చిత్ర పరిశ్రమలో లక్కీ దేవత..ఏం మాయా వేశావే సినిమాతో ఏ ముహుర్తాన ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో కానీ సమంత నిజంగానే తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. వరుస సినిమాలు, అగ్ర కథానాయకుల సరసన నటించి సినీ ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక అన్నీ ఇండస్ట్రీ లలో సామ్ కు ప్రత్యెక గుర్తింపు ఉంది. నాగచైతన్యతో వివాహం తర్వాత అక్కినేని వారి కోడలిగా మారిన సామ్‌.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో వేగాన్ని ఏ మాత్రం తగ్గించలేదు.


నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ వరుస హిట్ సినిమా లను తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే ఇటీవల వెబ్ సిరిస్ లో కూడా నటించి జనాలతో ప్రశంసలు అందుకుంది.మారుతోన్న కాలానికి అనుగుణంగా డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టిన సామ్‌ తొలి అడుగులోనే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు వరుస సిరీస్‌లో నటించడానికి రెడీ అవుతుంది. వీటి తో పాటుగా యాడ్ లలో నటిస్తూ అస్సలు ఖాళీ లేకుండా రెండు చేతులతో సంపాదించు కుంటుంది..


ఇకపోతే ఇప్పుడు సామ్ క్రేజ్ మరింత పెరగనుంది.తాజాగా సమంతకు మరో దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్‌ను ఇచ్చినట్లు వార్తులు వస్తున్నాయి. సమంత లీడ్ రోల్‌లో ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తోన్న నెట్‌ఫ్లిక్స్ ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఈ ప్రకటన గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.. ఒకవేళ ఇది నిజమే అయితే సామ్ డిజిటల్ స్క్రీన్ పై కూడా మరో రికార్డ్ ను బ్రేక్ చేయడం ఖాయం.. చేతిలో వరుస సినిమా లు కూడా ఉండటం తో సామ్ ఫుల్ బిజిగా ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: