పవన్ కళ్యాణ్ సినిమాల రీ ఎంట్రీ ప్రారంభం అయినప్పటి నుండి ఇండస్ట్రీ వర్గాలలో ప్రారంభంమైన హడావిడి ఇప్పటికి  కొనసాగుతూనే ఉంది. పవన్ తన తీరుకు భిన్నంగా వరసపెట్టి సినిమాలు ఒప్పుకోవడమే కాకుండా వరసపెట్టి అనేకమంది దర్శకులు చెపుతున్న కధలు వింటున్నాడు. ‘వకీల్ సాబ్’ పవన్ అభిమానుల అంచనాలకు మించి ఉండటంతో అతడు ప్రస్తుతం నటిస్తున్న సినిమాల లిస్టు రోజురోజుకు పెరిగిపోతోంది.


అంతేకాదు పవన్ నటించే తదుపరి సినిమాల పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ‘వకీల్ సాబ్’ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆమూవీ కలక్షన్స్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా రికార్డులు క్రియేట్ చేయలేకపోవడంతో దిల్ రాజ్ కు పవన్ మరొక సినిమాను చేస్తాను అని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.



దీనితో దిల్ రాజ్ పవన్ కోసం కథల వేట మొదలుపెట్టాడు అంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. వాస్తవానికి వేణు శ్రీరామ్ పవన్ కాంబినేషన్ లో మరొక సినిమాను చేయాలని దిల్ రాజ్ ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు అని అంటున్నారు. దీనితో ఈ దర్శకుల వేటలో పూరీ జగన్నాథ్ పేరుతో పాటు శ్రీకాంత్ అడ్డాల పేరు కూడ దిల్ రాజ్ దృష్టిలోకి వచ్చింది అన్న ప్రచారం జరుగుతోంది.    


ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ తో ‘అసురన్’ రీమేక్ గా ‘నారప్ప’ ను తీస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ కు రెడీగా ఉన్న ఈమూవీ అవుట్ పుట్ ను చూసిన దిల్ రాజ్ ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పవన్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో సెట్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలతో శ్రీకాంత్ తో ఒక మంచి కథ వ్రాయించే ప్రయత్నంలో దిల్ రాజ్ ఉన్నట్లు టాక్. ఈ వార్తలే నిజమైతే శ్రీకాంత్ అడ్డాల కు ఊహించని బ్రేక్ వస్తుంది అనుకోవాలి. అయితే ఇప్పటికే పవన్ నటిస్తున్న సినిమాల లిస్టు పెరిగిపోతున్న నేపధ్యంలో ఎంతవరకు పవన్ శ్రీకాంత్ అడ్డాల కు డేట్స్ ఇస్తాడు అన్నది సమాధానం లేని ప్రశ్న..  


మరింత సమాచారం తెలుసుకోండి: