‘అఖండ’ మూవీ విడుదల కాకుండానే బాలకృష్ణ ప్రకటిస్తున్న లేటెస్ట్ మూవీల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈ మూవీ తరువాత బాలయ్య    గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించబోతున్న మూవీ ప్రకనతో ఆ మూవీ పై మరింత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమాకోసం దర్శకుడు గోపిచంద్ మలినేని మంచి మాస్ అంశాలతో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు వస్తున్న వార్తలను చూసి బాలయ్య అభిమానులు  మంచి జోష్ లో ఉన్నారు.  

ప్రస్తుతం దర్శకుడు గోపీచాంద్ ఈసినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నాడు పల్నాటి ఫ్యాక్షన్ నేపథ్యంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్  ఈసినిమాలో నటిస్తాడని తెలుస్తోంది. బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమాలు అన్నీ ఇంచుమించు హిట్ అయిన పరిస్థితులలో ఇంకా ఈ మూవీ ప్రారంభం కాకుండానే బ్లాకు బస్టర్ హిట్ అన్న ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక నటీనటుల ఎంపిక ప్రారంభం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన నెగిటివ్ పాత్రకు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘క్రాక్’ సినిమా ఘన విజయంలో వరలక్ష్మి పాత్ర చాల కీలక ఫలితాన్ని ఇవ్వడంతో అదే సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని గోపీచంద్ వరలక్ష్మి ఎంపిక వైపు అడుగులు వేసినట్లు టాక్.  

ఇది ఇలా ఉండగా ఈ సినిమా కుసంబంధించి స్టార్ కాస్ట్ సెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. ఈసినిమాలో కూడ హీరోయిన్ ఛాన్స్ శృతి హాసన్ కు వచ్చే అవకాశం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శృతి మళ్ళీ కెరియర్ పై దృష్టి పెట్టడంతో వీలైనన్ని ఎక్కువ సినిమాలు వరసగా చేయాలని నిర్ణయించు కోవడంతో ఈ సినిమాకు సంబంధించి బాలయ్యకు హీరోయిన్ సమస్యలు  తీరిపోయాయి అని అంటున్నారు. సెంటిమెంట్స్ ను బాగా ఫాలో అయ్యే బాలయ్యకు ఇప్పుడు ‘క్రాక్’ సెంటిమెంట్ ప్రభావితం చేస్తోంది అనుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: