ప్రతి హీరో కెరియర్ లో ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఫిలిం చేయాలని కోరుకుంటాడు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరోగా చేయాలని ప్రతి హీరో కలలు కంటుంటాడు. తనదైన యాక్షన్ లో ఎంతో మంది హీరోలు ఈ పాత్రలో నటించి పోలీస్ ఉద్యోగానికి వన్నె తెచ్చారు. బయట ప్రపంచంలో కూడా పోలీస్ అంటే హీరో అనిపించేలా పోలీస్ పాత్ర గౌరవాన్ని పెంచారు. ఆ విధంగా టాలీవుడ్ లో చాలా మంది పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెరిసి సూపర్ హిట్ సినిమాలను చేశారు.  అలానే రామ్ చరణ్ తేజ్ ఏరికోరి మరీ చేసిన సినిమా ధృవ.

తమిళంలో జయం రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. తమిళనాడు లో అప్పటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను ఈ సినిమా తిరగరాసింది. స్క్రీన్ ప్లే పరంగా తెలుగు జనాలను కూడా మెచ్చిన సినిమా తని ఒరువన్.. దీని పై మనసు పడ్డ రామ్ చరణ్ తేజ్ తెలుగులో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ పేరుతో సినిమా చేశాడు. తమిళంలో విలన్ గా చేసిన అరవింద్ స్వామిని ఇక్కడ కూడా అదే పాత్రలో నటింపచేశాడు.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నవదీప్ కీలక పాత్రలో రూపొందిన ఈ చిత్రం 2016 డిసెంబర్ 9న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. సిద్ధార్థ అభిమన్యు గా అరవిందస్వామి చేసిన నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. 50 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. నిజంగా మనసు పెట్టి ఏ పని చేసినా విజయవంతం అవుతుంది అన్నట్లు ఈ సినిమాలోని ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధతో మనసు పెట్టి మరి సినిమాకి పని చేశారు కాబట్టే ఈ సినిమా ఈ రేంజ్ లో హిట్ అయ్యింది. //////

మరింత సమాచారం తెలుసుకోండి: