బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్ లో చత్రపతి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ఇంకా నిలదొక్కుకోని బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో సినిమా చేయడం ఏంటి అని విమర్శకులు ఇప్పటికే పలు చలోక్తులు విసురుతూ ఉన్నారు. అందులోనూ తెలుగు సినిమా తో తెలుగు డైరెక్టర్ తో హిందీలో సినిమా చేయడం ఏంటి అని విమర్శిస్తున్నారు. అయితే ఇవేవీ పట్టించుకోని బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో సినిమాను మొదలు పెట్టేసాడు. దీనికి డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం చేస్తుండగా షూటింగ్  కూడా మొదలైంది. 

హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న మొట్ట మొదటి సినిమా కావడంతో బెల్లంకొండ శ్రీనివాస్ పై భారీగా ఖర్చు పెడుతున్నారు మేకర్స్.  ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. హైదరాబాద్ లో వేసిన సెట్ కూడా వర్షాల కారణంగా దెబ్బతిన్నది. మళ్ళీ షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడో ఇంకా క్లారిటీ లేదు. ఈ లోపు తెలుగులో తన తదుపరి సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. తమిళంలో ఇటీవలే హిట్ అయిన కర్ణన్ రీమేక్ హక్కులను బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ తీసుకున్నారు.

హిందీ చిత్రం మొదలవడానికి కాస్త సమయం పట్టేలా ఉండడంతో ఈ లోపు ఆ సినిమాకు సంబంధించిన రీమేక్ చేయాలని భావించగా ఈ చిత్ర  డైరెక్షన్ బాధ్యతలను కూడా వి.వి.వినాయక్ కే ఇస్తున్నాడట. తెలుగులో అల్లుడు శ్రీను ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ ను పరిచయం చేసింది వినాయకే. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఆయన డైరెక్షన్లోనే పరిచయమవుతున్నాడు. ఇప్పుడు తెలుగు లో కష్టకాలంలో ఉన్న తన కెరీర్ ను నిలబెట్టుకోవడానికి మళ్ళీ వినాయక్ నే నమ్ముకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇలా ప్రతిసారి  బెల్లంకొండ శ్రీనివాస్ వినాయక్ నే నమ్ముకోవడం అంతమంచిది కాదని అంటున్నారు బెల్లంకొండ అభిమానులు. చత్రపతి సినిమా రీమేక్ విషయంలో మాత్రం ఈ ఇద్దరు సీరియస్ గా నే దిగినట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: