టాలీవుడ్ మోస్ట్ హ్యండ్ సమ్ కపుల్స్ లిస్టులో రామ్ చరణ్ ఉపాసన లు మొదటి స్థానంలో ఉంటారు. ఈరోజు వీరిద్దరి 9వ వార్షికోత్సవం వీరిద్దరూ పెళ్ళి చేసుకోవడానికి ముందు 5 సంవత్సరాలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. చిరంజీవి వారసుడుగా చరణ్ ఒక స్థాయిలో ఉంటే అపోలో సంస్థల అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలుగా ఉపాసన అపోలో ఫార్మసీ నిర్వహణలో చాల కీలకంగా తన బాధ్యతలను నిర్వహిస్తోంది.

వీరిద్దరు ఎప్పుడు చాల బిజీగా ఉంటున్నా అవకాశం చిక్కినప్పుడల్లా అనేక దేశాలకు టూర్లు వెళ్ళుతూ అక్కడి ప్రదేశాలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉండే ఉపాసన ఈ కోవిడ్ సమయంలో అందరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫుడ్స్ తినాలి అన్నవిషయం పై బాగా అవగాహన కల్పించి తన సామాజిక బాధ్యతను నెరవేర్చింది.

చరణ్ స్టైలింగ్ విషయంలో అనేక సలహాలు ఇచ్చే ఉపాసనకు సినిమాలు అంటే చాల ఇష్టం. చరణ్ ను ముద్దుగా ‘మిష్టర్ సి’ అంటూ పిలిచే ఉపాసన అంటే మెగా ఫ్యామిలీలోని అందరు విపరీతంగా ఇష్టపడతారు. ఈరోజు జరుగుతున్న వీరిద్దరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మెగా అభిమానులకు మాత్రం ఒకే ఒక లోటు గుర్తుకు వస్తోంది. రామ్ చరణ్ కు 36 సంవత్సరాలు దాటిపోతున్నాయి. చరణ్ ఉపాసనలకు పెళ్లి అయి 9 సంవత్సరాలు దాటిపోతున్నా చరణ్ కు వారసుడుగా బుల్లి చరణ్ ఇంకా పుట్టక పోవడం ఒక లోటుగా మెగా అభిమానులు భావిస్తూ ఉంటారు. అయితే ఈలోటును ఉపాసన అంగీకరించదు.

ఆమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమకు పిల్లలు పుట్టే విషయం పై ఉపాసన ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘పెళ్లి తర్వాత గర్బం దాల్చడమనేది నా పర్సనల్ విషయం. మాకు ఇప్పట్లో పిల్లలు వద్దని అనుకున్నాము. ఇప్పుడిప్పుడే నేను బరువు తగ్గుతున్నాను. పిల్లలని ఎపుడు కనాలనే విషయమై మాకు క్లారిటీ ఉందని పలు సందర్భాలలో చెప్పాను.’ అంటూ ఆమె తన మనసులోని అభిప్రాయాన్ని చాల స్పష్టంగా చెప్పినప్పటికీ చరణ్ అభిమానులకు మాత్రం బుల్లి చరణ్ ను త్వరలో చూడాలి అన్నకోరిక అభిమానులలో ఉంటుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: