పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం గా ఇటీవలే వచ్చిన వకీల్ సాబ్ సినిమా అరుదైన ఘనత దక్కించుకుంది. 2021లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలు మరియు వెబ్ సిరీస్  ల పట్టీక ను ఐఎండీబీ ఇంటర్నెట్ తాజాగా విడుదల చేయగా ఈ లెక్కల ప్రకారం పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమా ఏడవ స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో దలపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమా నిలవగా అస్పిర్టన్స్ వెబ్ సిరీస్, ది వైట్ టైగర్ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. 

తమన్నా నవంబర్ స్టోరీ 5వ స్థానంలో నిలవగా ధనుష్ కర్ణన్, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, క్రాక్ 6, 7, 9 వ స్థానాలు దక్కించుకున్నాయి. రాజకీయాల నుంచి గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రంగా చేసిన వకీల్ సాబ్ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే మంచి ప్రేక్షకాదరణ తో పాటు మంచి వసూళ్లను కూడా సాధించింది. బాలీవుడ్ లో వచ్  సూపర్ హిట్ సినిమా పింక్ కి రీమేక్ గా  తెలుగులో ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా అంజలి , నివేదాథామస్, అనన్య పాండే లు కీలక పాత్రలో నటించారు.

ప్రకాష్ రాజ్ మరొక లాయర్ పాత్రలో నటించగా పవన్ కళ్యాణ్ తో ఢీ అంటే ఢీ అనే రేంజ్ లో ఆయన నటించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా 21 రోజులకే ఓ టీ టీ లో రిలీజ్ కాగా ఈ సినిమా అక్కడ కూడా మంచి ప్రేక్షకాభిమానాన్ని పొందింది. తొలిసారి లాయర్ గా పవన్ కళ్యాణ్ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక విజయ్ హీరోగా విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా తెరకెక్కిన మాస్టర్ సినిమా  ధియేటర్ లలో విడుదలై రెండు వందల కోట్ల కు పైగా వసూళ్ళు సాధించి భారీ ప్రేక్షకాభిమానాన్ని పొందింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ,హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై భారీ హిట్ గా నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: