ఇండస్ట్రీకి చాలా మంది నటులు పరిచయం అవుతుంటారు. కొందరికి అదృష్టం కలిసి వచ్చి స్టార్ హీరోయిన్స్ అవుతే మరి కొంతమంది పెళ్లి చేసుకొని వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతున్నారు. అయితే కొంతమంది హీరోయిన్స్ సన్యాసులుగా మారిపోయారు. అలాంటి నటుల గురించి ఒక్కసారి చూద్దామా. నటి సోఫియా హయత్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె 2014లో నగ్నంగా ఐస్ బకెట్ ఛాలెంజ్ చేసి సంచలనం సృష్టించింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఆమె ఉన్నట్లుండి సన్యాసిగా మారిపోయింది. ఇక తనకి కృపతోనే తన తొమ్మిది జన్మలు గురించి తెలిసిందని అందుకే తాను ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది.



అలాగే 1984 మిస్ ఇండియా ఫైనలిస్ట్ బర్ఖా మదన్ ఎన్నో సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను అలరించారు. అంతేకాదు.. ఆమె సినిమాలో కూడా నటించారు. అయితే సిక్కింలోని బౌద్ధ మఠాన్ని దర్శించడానికి వెళ్లి అక్కడే బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ సన్యాసిగా మారిపోయింది. ఇక ఆషికి సినిమా హీరోయిన్ అను అగర్వాల్ సైతం సన్యాసినిగా చేంజ్ అయ్యింది. అయితే ఆమెకు హీరోయిన్‌గా మంచి గుర్తింపు ఉన్న సమయంలోనే వాటన్నిటినీ వదిలేసి 1997లో ఉత్తరాఖండ్‌లోని యోగా ఆశ్రమంలో యోగినిగా చేరారు. ఇక ఈ ఆశ్రమంలో చేరడం వల్లే నిజమైన ఆనందం, సంతృప్తిని పొందుతున్నాని ఆమె వెల్లడించారు.



ఇక ఒకప్పటి కుర్రాళ్ళ గుండెలు కోసేసిన మమతా కులకర్ణి ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆ తర్వాత శ్రీ చైతన్య గగంగిరి నాథ్ దగ్గర శిక్షణ తీసుకుని సన్యాసినిగా మారిపోయింది ఈమె. అలాగే వినోద్ ఖన్నా 1970,80వ దశకంలో అందమైన హీరోగా పేరు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఓషో శిష్యునిగా మారి ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేశారు. అయితే ఆధ్యాత్మిక మార్గంలో నడవడంతో కుటుంబ సభ్యుల బాగోగులను చూసుకోలేక పోయినట్లు తెలిపారు. ఇక ఆయన మొదటి భార్య గీతాంజలి విడాకులు తీసుకున్నారుని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: