ఇటీవలె విడుదలైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తో అనన్య నాగళ్ళ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని నటిగా గుర్తింపు పొందింది. అప్పటిదాకా టాలీవుడ్ లో చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన ఈ హీరోయిన్ ఒక్కసారిగా ఈ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంజలి నివేదాథామస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా వారితో పాటు అనన్య నాగల్లా కూడా నటించి మెప్పించింది.

సినిమా కంటే ముందు అనన్య నాగళ్ళ ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన మల్లేశం సినిమాలో ఆయన భార్యగా నటించింది. ఆ పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయినా ఆమె తాను ఆ పాత్రలో ఒదిగి పోవడానికి చాలా శ్రమించారు అని చెబుతోంది. పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయిలా కనిపించాలని చాలా కసరత్తులు చేశానని చెబుతోంది. మల్లేశం సినిమా ఓ మారుమూల గ్రామంలో ఎంతో సింపుల్ గా తెరకెక్కిన సినిమా. నేను కూడా అలాంటి సింపుల్ వ్యక్తికి భార్యను కావడం వల్ల సహజంగా కనబడే విధంగా అక్కడి విశేషాల గురించి తెలుసుకున్నా అని చెబుతోంది.

కొన్ని కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తో టాలీవుడ్ లోని దర్శకులను ఆకర్షించిన అనన్య చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న మల్లేశం సినిమా లో ఛాన్స్ కోసం చాలా కష్టపడి ఉందని ఓ వీడియోలో వెల్లడించింది. ఈ సినిమాలోని పద్మ అనే పాత్రలో ఆమె నటించిన తీరుకు విమర్శకులు సైతం ప్రశంసలు అందించారు. ఇక వీడియో లో ఆమె మల్లేశం సినిమా తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా పల్లెలకు వెళ్లి అక్కడ వాళ్ల ఆటలు, ప్రవర్తన, భాష, యాస ఎలా ఉంటుందో తెలుసుకున్నానని చెప్పింది. తను ఆన్ స్క్రీన్ మీద చేసే పాత్ర కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పింది. అందరినీ అలరించడానికి తాను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పుకొచ్చింది. తనపై నమ్మకం ఉంచి పద్మ లాంటి పాత్రను ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: