పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చి, హిట్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత వరుస ఫ్లాప్ సినిమాలు చేసి డీలా పడిపోయాడు హీరో నారా రోహిత్. తొలిసినిమా బాణంతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొని ఆ తరువాత సోలో తో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలోనే ఈ రేంజ్ లో హిట్ అందుకున్న నారా రోహిత్ లో భవిష్యత్తులో స్టార్ హీరో అయ్యే అవకాశాలు మెండుగా కనిపించాయి. 

రెండు సినిమాలు విజయం సాధించడంతో ఆమెకు మంచి ఆఫర్స్ వచ్చాయి. ఇందులో కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి. చాలా వరకు మంచి కథలు లేని సినిమాలు ఉన్నాయి. వాటిలో బాక్సాఫీస్ వద్ద ఆయన చేసిన సినిమాలు ఏ ఒక్కటి కూడా హిట్ కాలేదు. వరస ఫ్లాపులతో గతంలో ఉన్న దూకుడు చూపించలేకపోయా డు రోహిత్.  కెరీర్ కూడా స్లో అయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ సినిమా చేస్తున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. కెరీర్ లో తనకు తొలి సినిమా చేసిన దర్శకుడు చైతన్య దంతులూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

1971 యుద్ధ సమయంలో జరిగిన ఓ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోందట. ఓవైపు యుద్ధంతో మరోవైపు ప్రేమకథ తో అల్లిన కథాంశం తో ఈ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.  కరోనా పూర్తి అవగానే సినిమా పనులు మొదలుపెడతారు. ఈ సినిమా కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా పదిహేను కోట్ల రూపాయ ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. హిట్ చూసి చాలా కాలమైనా రోహిత్ కి ఈ రేంజ్ లో బడ్జెట్ పెట్టడం పెద్ద సాహసమే అని చెప్పాలి. మరి ఈ సినిమా తో అయినా హిట్ సాధిస్తాడా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: