ఏ ఇండస్ట్రీలో అయినా ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేయడం సర్వసాధారణం. ఎందుకంటే తనకు ఉన్న కమిట్ మెంట్ వల్లనో డేట్స్ లేకపోవడం వల్లనో మరే ఇతర కారణాల వలనో సదరు హీరో దర్శకుడు చెప్పిన కథను రిజెక్ట్ చేస్తాడు. అయితే ఆ దర్శకుడు అదే కథను వేరే హీరో కి చెప్పి ఓకే చేయించుకుంటారు. ఇండస్ట్రీలో ఇది తరచూ జరిగే పనే..  ఆ విధంగా టాలీవుడ్ లో మంచి దర్శకుడిగా ఉన్న మెహర్ రమేష్ అల్లు అర్జున్ కి ఓ కథ చెప్పగానే ఆయన రిజెక్ట్ చేశారు. అయితే  ఎన్టీఆర్ కి అదే కథ నీ చెప్పి ఆ చిత్రాన్ని ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రంగా చేశాడు.

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు 28 సినిమాల్లో నటించగా అందులో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన చిత్రం శక్తి. మగధీర సినిమా చూశాక ఇలాంటి సినిమా చేయాలని ఫిక్స్ అయిన యంగ్ హీరోల ను టార్గెట్ చేసుకున్న దర్శకుడు మెహర్ రమేష్ శక్తి స్క్రిప్టుని రెడీ చేసుకుని అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ లకు వినిపించాడు. ఈ సినిమాను ఎలాగైనా అల్లు అర్జున్ తోనే చేయాలి అని అనుకున్నా మెహర్ రమేష్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తో మంతనాలు జరిపాడు కానీ అప్పటికీ మగధీర లాంటి విజయాన్ని తన కుమారుడు కి ఇవ్వాలని అల్లు అరవింద్ వినాయక్ దర్శకత్వంలో బద్రీనాథ్ కి శ్రీకారం చుట్టాడు.

దాంతో  చేసేది ఏమీ లేక ఎన్టీఆర్ నీ ఎలాగోలా ఒప్పించి శక్తి సినిమాను తెరకెక్కించాడు. సుమారు 42 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టోటల్ గా 20 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ గా మిగిలింది. ఆ విధంగా మెహర్ రమేష్ చేతిలోనుండి అల్లు అర్జున్ సేఫ్ అయ్యాడు ఎన్టీఆర్ బలైపోయాడు. తర్వాత కెరీర్ లో ఒకటి రెండు ఇతర ఫ్లాపులను మూటగట్టుకున్న ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి వరుస విజయాలతో అపజయం అంటే తెలియకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇపుడు రామ్ చరణ్ తో కలిసి దుమ్ము రేపడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: