సాధారణంగా సినిమాలలో నటీ నటులు పాటలు పాడటం మామూలు విషయమే.ఇప్పటికీ ఎంతోమంది నటీ నటులు తమ సినిమాలతో పాటు వేరే సినిమాలలో కూడా పాటలు పాడారు. ఇక అలా పాటలు పాడిన నటులలో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలి. తారక్ పాడిన ప్రతి పాట కూడా యూత్ ని మెప్పించి పెద్ద హిట్ అయ్యింది. గతంలో తన సినిమాలైన "యామదొంగ"లో "ఓలమ్మి తిక్కరేగిందా..." , "కంత్రి"లో  "1 2 3.. నేనొక కంత్రి" , "అదుర్స్"లో "వేర్ ఈజ్ ద..", "రభస"లో "రాకాసి రాకాసి..", "నాన్నకు ప్రేమతో" లో "ఐ వాన ఫాలో ఫాలో యూ.."వంటి ఎన్టీఆర్ పాడిన పాటలు యూత్ ని ఎంతగానో మైమరచిపోయాయి. ఆ పాటలు పెద్ద వైరల్ హిట్ గా నిలిచాయి.


ఇక తెలుగులోనే కాకుండా కన్నడలోనూ పాట పాడాడు తారక్. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమా "చక్రవ్యూహ" లో "గెలయా" అనే ఓ అదిరిపోయే పాట పాడాడు తారక్. ఇక తమన్ సంగీతంలో పాడిన ఆ పాటలో ఎన్టీఆర్ గొంతుకి కన్నడ ఆడియన్స్ ఫుల్ ఫిదా అయ్యారు.అలాగే పునీత్ ఫ్యాన్స్ కూడా తారక్ లాంటి పెద్ద స్టార్ హీరో మా హీరో సినిమాలో అదిరిపోయే పాట పాడాడు అని గర్వంగా చెప్పుకున్నారు.ఇక ఈ పాట తారక్ పాడాడు కాబట్టే తెలుగులో మన ఆడియన్స్ కన్నడ అర్ధం కాకపోయినా విని ఎంజాయ్ చేశారు. అంతలా ఆకట్టుకుంటుంది తారక్ గొంతు.


కేవలం సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్ మాత్రమే కాదు అదిరిపోయే పాటలు కూడా పాడగలడని నిరూపించాడు.ఇక మరోసారి పాట పాడబోతున్నాడు తారక్. తన సన్నిహితుడు కొరటాల శివ దర్శకత్వంలో చెయ్యనున్న రెండవ సినిమాలో తారక్ పాట పాడబోతున్నాడట. కొరటాల శివ కోరిక మేరకు ఫ్యాన్స్ కోసం తారక్ పాటని ఆలపించబోతున్నాడట. ఇక ఈ విషయం తెలిసిన తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా వున్నారు. ఇక తారక్ పాడబోతున్న ఈ పాటని యూ ట్యూబ్ లో పెద్ద వైరల్ హిట్ చెయ్యాలని ఫ్యాన్స్ ఇప్పట్నుంచే గట్టిగా ఫిక్స్ అయ్యారట. మరి చూడాలి తారక్ మరోసారి తన గొంతుతో ఎలా మెప్పిస్తాడో అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: