టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది.ఇప్పటికే యూత్ లో మాంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ హీరో.. సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ని, అలాగే సౌత్ లోనే మోస్ట్ డిజైరబుల్ మెన్ గా నిలిచి సంచలనంగా మారాడు. ఇక తాజాగా మరో సంచలనానికి తెర లేపాడు ఈ రౌడీ హీరో.పాపులర్ బాలీవుడ్ సెలెబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ లో పచోటు దక్కించుకున్నాడు.మొత్తం సౌత్ లోనే ఈ క్యాలెండర్ లో ప్లేస్ దక్కించుకున్న మొట్ట మొదటి హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం.దీంతో సౌత్ తో పాటూ నార్త్ లో కూడా విజయ్ క్రేజ్ పెరగనుంది. ఇక ఈ క్యాలెండర్ లో బాలీవుడ్ స్టార్ హీరోలతో మన రౌడీ హీరో కూడా కనిపించనున్నాడు.

అయితే ఈ హీరో నటించిన కేవలం తొమ్మిది సినిమాలకే ఇలాంటి నేషనల్ క్రేజ్ రావడం అనేది గమనార్హం.ఇక తాజాగా ఈ క్యాలెండర్ కి సంబంధించిన ఓ సరికొత్త పోస్టర్ ని విడుదల చేసాడు డబూ రత్నాని.ఈ పోస్టర్ లో విజయ్ రగ్డ్ అండ్ స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చాడు.అంతేకాదు ఈ పోస్టర్ ని లాంచ్ చేసిన సందర్భంగా విజయ్ తో ఇంస్టాగ్రామ్ లైవ్ లో ముచ్చటించాడు డబూ.ఈ లైవ్ లో భాగంగా విజయ్ మాట్లాడుతూ.."ఫోటో షూట్ చాలా తొందరగా, చాలా క్వాలిటీగా జరిగింది. కొన్నేళ్ల నుండి నాకు నచ్చిన ఎంతో మంది స్టార్స్ మీ క్యాలెండర్ లో కనిపించారు. షారుఖ్ ఖాన్ సర్ ను మీ క్యాలెండర్ లో చూశా. తను చాలా మంచి వ్యక్తి.

 అప్పటినుండి నాకు మీ క్యాలెండర్ లో కనిపిస్తే బాగుంటుంది అనుకునేవాడిని. ఫైనల్ గా నా కోరిక తీరింది` అని తెలిపాడు.ఇక ఫోటోగ్రాఫర్‌ డబూ రత్నాని మాట్లాడుతూ, `థాంక్యూ విజయ్ దేవరకొండ నా క్యాలెండర్ లో డెబ్యూ చేసినందుకు. మీరు చాలా కూల్ పర్సన్. ఈ ఫొటో షూట్ చేసినపుడు చాలా ఎంజాయ్ చేసాను. నా క్యాలెండర్ లో కనిపించిన ఫస్ట్ సౌత్ యాక్టర్ మీరు. నేను షూట్ చేసిన బెస్ట్ డెబ్యూ ఫొటోషూట్ మీదే. ధన్యవాదాలు` అని తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ హీరో.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా కనిపించనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: