బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న వారిలో సోహెల్ ఒకడు. గత నాల్గవ సీజన్లో బిగ్ బాద్ హౌజ్ కి ఎంట్రీ ఇచ్చిన సోహెల్.. హౌజ్ లో అందరితో మంచి ప్రెండ్ షిప్ ని మైంటైన్ చేస్తూ..మంచి ఆట తీరును కనబరుస్తూ ఫైనల్ వరకు చేరుకున్నాడు.ఇక ఫినాలే లో సెకండ్ రన్నరప్ గా నిలిచిన సోహెల్ ని ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సైతం మెచ్చుకున్నారు.ఇక బిగ్ బాస్ హౌజ్ కి వచ్చాక ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్న ఇతడు..బయటికి వచ్చాక పలు సేవా కార్యక్రమాలు చేపట్టి.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.సోహెల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా ఇప్పుటి వరకు చాలామందికి సాయం అందించాడు.


ఇక తాజాగా ఈ లాక్ డౌన్ లో ఇబ్బందులకు గురవుతున్న సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసాడు సోహెల్.అంతేకాకుండా సినీ కార్మికులకు మరికొన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని కూడా భరోసా ఇచ్చాడు.అయితే ఇది తానొక్కడి శ్రమ మాత్రమే కాదని..కొందరు ఫ్యాన్స్ కలిసి సోహెలిజమ్స్ గా ఏర్పడి ఈ సేవా కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్నామని చెప్పాడు.ఇక ఇప్పటికే ఈ సంస్థ ద్వారా 24 లక్షలకు పైగా ఖర్చుతో వైద్య సేవలు కూడా అందించినట్లుగా వెల్లడించాడు.వారిలో గుండె సంబంధిత వ్యాధితో,బ్రెయిన్ ట్యూమర్ వంటి వ్యాధులతో బాధ పడుతున్న వారికి ఈ వైద్య సేవలు అందించినట్లు తెలిపాడు.

ఇక భవిష్యత్తు లో కూడా ఇలాంటి మంచి పనులు మరెన్నో చేస్తామని.. అందుకు మీ అందరి ఆశీర్వచనాలు కావాలని పేర్కొన్నాడు సోహెల్.ఇక ఈ సంస్థ ఇంత బాగా పని చేయడానికి, మరింత ముందుకెళ్లాడనికి సోహెలిజమ్స్ ని ఏర్పాటు చేసిన తన ఫ్యాన్స్ కారణమని చెప్పుకొచ్చాడు.మొత్తానికి సినీ కార్మికులకు అండగా నిలుస్తూ తమ గొప్ప మనసును చాటుకున్నాడు ఈ బిగ్ బాస్ యాంగ్రీ మ్యాన్. ఇక ప్రస్తుతం సోహెల్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అందరూ కొత్త వాళ్లతో ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయినట్లు సమాచారం.అంతేకాదు ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: