పెద్దగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా నిలదొక్కుకున్న నటుడు నాగ శౌర్య. మనోడు చేస్తున్న అన్ని సినిమాల ద్వారా లవర్ బోయ్ ఇమేజ్ ఇప్పటికే వచ్చేసింది.. దీంతో యాక్షన్ హీరో అనిపించుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో పుట్టిన నాగశౌర్య ఆ తర్వాత సినిమాల్లో నటించాలనే కోరికతో హైదరాబాద్ చేరి క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా చాలా మందికి తెలియదు ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చందమామ కథలు అనే సినిమాలో రాజు అనే ఒక మున్సిపాలిటీ చెత్త బండి డ్రైవర్ గా నటించి అందరి దృష్టిలో పడ్డాడు..

 ఆ తర్వాత వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమా ఆయనకు మంచి బ్రేక్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన లక్ష్మీ రావే మా ఇంటికి, జాదూగాడు, కల్యాణ వైభోగమే, నీ జతలేక లాంటి సినిమాలు ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్ తీసుకువచ్చాయి. అయితే చివరిగా అశ్వద్ధామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి వరుడు కావలెను అనే సినిమా కాగా మరొకటి లక్ష్య అనే సినిమా. ఈ రెండు సినిమాలు కాకుండా తమ సొంత ప్రొడక్షన్ హౌస్ అయినా ఐరా ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న నాలుగో సినిమాలో కూడా ఆయన హీరోగా నటిస్తున్నాడు. 


తాజాగా ఆయన జిమ్ లో ఉన్న ఒక ఫోటోను పిఆర్ సంస్థలు షేర్ చేశాయి. ఈ జిమ్ బుక్ లో నాగ శౌర్య బాడీ ఒక రేంజ్ లో చూపిస్తున్నాడు. బహుశా లక్ష్య అనే సినిమా కోసం ఆయన ఈ బాడీ మెయింటేన్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా విలువిద్య నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా కోసమే ఆయన సిక్స్ పాక్ కి మించిన కండలు తిరిగిన దేహంతో చూపిస్తూ ఉన్న తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు మీరు కూడా చూసేయండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: