‘జయం’ సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన నితిన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 19  ఏళ్ళు పూర్తి అవుతున్నా ఇంకా అతడి కెరియర్ పూర్తిగా సెటిల్ కాలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ‘దిల్' సినిమాతో యూత్ కు బాగా దగ్గర అయిన తరువాత 'సై' సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా  చాటినప్పటికి  అయితే ఆ తర్వాత నితిన్ సినిమా కెరియర్ ఆశించిన స్థాయిలో సాగలేదు అన్న అభిప్రాయాలు ఉన్నాయి.  


వరుసగా అరడజను ప్లాపులు  పలకరించినా నిరాశ చెందకుండా పడిలేచిన కెరటం మాదిరిగా మళ్ళీ ఫామ్ లోకివచ్చిన నితిన్ ఇప్పుడు మళ్ళీ చాల వేగంగా సినిమాలు చేస్తున్నాడు. గత సంవత్సరం ‘భీష్మ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఉత్సాహంతో నటించిన ‘చెక్’ పరాజయం సాదించినా కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలో విడుదలైన ‘రంగ్ దే’ తో కొంత వరకు ట్రాక్ లోకి వచ్చాడు.



రాఘవేంద్రరావు, రాజమౌళి, పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మ, వివి. వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్రమ్ కె. కుమార్ వంటి అగ్ర దర్శకులతో కలిసి నితిన్ పనిచేనప్పటికి ఇంకా నితిన్ టాప్ హీరోల లిస్టులోకి వెళ్ళ లేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో నితిన్ తన 30వ సినిమాగా ‘మాస్ట్రో’ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు.  


నితిన్ 19 సంవత్సరాలు సినిమా కెరియర్ పూర్తి చేసుకున్న సందర్భంగా  అతడి అభిమానులు #19Years For NITHIINin TFI అనే హ్యాష్ ట్యాగ్ నిన్న సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇది ఇలా ఉంటే టాప్ యంగ్ హీరోలు అంతా ఇంకా కరోనా పరిస్థితులకు భయపడి తమ ఇళ్ళల్లోనే ఉండిపోతూ ఉంటే నితిన్ ధైర్యం చేసి తన లేటెస్ట్ మూవీ ‘మాస్ట్రో’ షూటింగ్ ను మొదలుపెట్టడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. దీనితో నితిన్ ను అనుసరిస్తూ ఇప్పుడు మన టాప్ యంగ్ హీరోలు అంతా మళ్ళీ షూటింగ్ లు బాటపట్టే ఆస్కారం ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: