స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా ప్రాజెక్టు తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బన్నీ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా మాస్ లుక్ లో కనిపించనున్నారు. పెరిగిన గడ్డం, చింపిరి జుట్టుతో ఓ లారీ డ్రైవర్ పాత్రలో ఫుల్ మాస్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాడు. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ చిత్రానికి ప్రస్తుతం బ్రేక్ పడింది. కాగా ఈ సినిమా మొదలైనప్పటి నుండి రోజుకో గాసిప్ ఫ్యాన్స్ ని ఉవ్విళ్లూరిస్తోంది. ఈ సినిమాలో బన్నీ స్టైల్, స్లాంగ్, లుక్కే కాదు మరో పెద్ద సర్ ప్రైజ్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 

సుకుమార్ రంగస్థలం చిత్రంలో చెర్రీ పాత్రకు చెవుడు అనే ఎలిమెంట్ ను జోడించి ఈ సినిమాని మరింత రక్తి కట్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో కూడా బన్నీని మరింత డిఫరెంట్ గా చూపించబోతున్నారట. చిన్నపాటి మతిమరుపు స్వభావం, అలాగే కాస్త నత్తి ఉండేలా అల్లు అర్జున్ క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు వినికిడి. ఈ సినిమాలో బన్నీ రోల్ ని ఎంతో సహజంగా చూపించేందుకే ఇలా ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇది విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరీ ఇంత పెద్ద సర్ప్రైజా అంటూ ఆశ్చర్యపోతూ సంతోషంతో గంతులు వేస్తున్నారు.

మరి వెండితెరపై పుష్ప సినిమాలో స్టైలిష్ స్టార్ ఎలా కనిపించబోతున్నాడో అనేది క్లారిటీగా తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా మలయాళ నటుడు ఫాహాధ్ ఫాజిల్ విలన్ పాత్ర చేస్తున్నారు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో  నటిస్తున్నారు. యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: