విజయ్ సేతుపతి..  ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  ఒక చిన్న హీరో గా కెరీర్ ప్రారంభించి ఇక ఇప్పుడు..  పాత్రకు ప్రాణం పోసే నటుడిగా గుర్తింపు సంపాదించి.. స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు విజయ్ సేతుపతి. స్టార్ హీరో ఇమేజ్ వచ్చాక  కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు హీరోలు. కానీ విజయ్ సేతుపతి కి మాత్రం అలాంటి లిమిటేషన్స్ ఏమీ లేవు. స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ..  నటనకు ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్ర వచ్చిన చేస్తూ తనలోని నటుణ్ణి ప్రూవ్ చేసుకుంటూనే వున్నాడు.



 ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అవుతున్నాడు విజయ్ సేతుపతి. అయితే ఇటీవలి కాలంలో విజయ్ సేతుపతి ఏకంగా మెగా హీరోలకు సంబంధించిన రెండు సినిమాలు చేశాడు.  ఒకటి మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా అయితే... మరొకటి ఇక ఇటీవలే మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయమైన వైష్ణవి తేజ్ ఉప్పెన సినిమాలో విలన్ పాత్రలో నటించాడు విజయ్ సేతుపతి. దీంతో మెగా ఫ్యామిలీకి విజయ్ సేతుపతి కి మధ్య మంచి అనుబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది.



 అయితే మెగా హీరోల రెండు సినిమాల్లో కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న విజయ్ సేతుపతి ఇక ఇప్పుడు మరో మెగా మూవీలో నటించబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.  మెగాస్టార్ చిరంజీవి విజయ్ సేతుపతి కి ఫోన్ చేసి తన తర్వాత సినిమాలో విలన్ రోల్ లో నటించాలని కోరాడట.  ఇప్పటికే చిరంజీవి అంటే అమితమైన అభిమానం చూపించే విజయ్ సేతుపతి..  స్వయంగా మెగాస్టార్ ఫోన్ చేయడంతో ఇక నో చెప్పలేకపోయారట. దీంతో చిరు తర్వాత సినిమాల్లో ఇక విలన్ రోల్ లో విజయ్ సేతుపతి కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజం అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: