ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ఒంటి కుందేళ్ళు కాస్త బయట సమాజంలో సింహాలు గా మారుతున్నారు. మగాళ్ళ తో పాటు అన్ని రంగాల్లో ఆడవారు కూడా ఉండడం ప్రతి ఒక్కరు ఎంతో గర్వించదగ్గ విషయం. ఒకటేమిటి అన్ని రంగాలలో మహిళలు తమ సత్తా చాటుతూ మగవారికి సవాలు విసురుతున్నారు. హైదరాబాదులో పొట్టకూటి కోసం పిల్లల చదువుకోసం ఆటోలు నడిపిన ఆడవాళ్ళని చూశాం.. బస్సు డ్రైవర్ గా, ట్రక్ డ్రైవర్ గా చేసిన మహిళలను చూశాం.

తాజాగా ఒక 24 ఏళ్ల అమ్మాయి లారీ డ్రైవర్ గా పని చేస్తుంది. డ్రైవింగ్ చేయడం ఎంతో ఇష్టమైన పని అంటుంది. లారీ డ్రైవింగ్ మగాల్లే కాదు మేము కూడా చేయగలం ఆని  నిరూపిస్తుంది. ఆమె పేరు దెలీషా డేవిస్. ఎంకామ్ చదివిన ఈమె లారీ డ్రైవింగ్ ను వృత్తి గా ఎంచుకుంది. 300 కిలోమీటర్ల పాటు అలుపూ సొలుపూ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఎంతో పనిని ఎంతో ఆస్వాదించడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎంతో ధైర్యంతో తన కుమార్తెను డ్రైవింగ్ చేసేందుకు ప్రోత్సహించారు ఆమె తల్లిదండ్రులు. వారానికి మూడు పర్యాయాలు పెట్రోల్ ట్యాంకర్ ను తీసుకువచ్చి మలప్పురం వరకు తీసుకు వెళ్లి మళ్ళీ తిరిగి వస్తుంది. 

ఇప్పటి తరం అమ్మాయిలకు ప్రతినిధి లా కనిపించే ఆమె తండ్రి లారీ డ్రైవర్ కావడంతో చిన్నతనం నుంచే డ్రైవింగ్ పై ఆసక్తి పెంచుకుందట. ఓసారి రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా దెలిషా లారీ ని కూడా ఆపారు. డ్రైవింగ్ సీట్లో అమ్మాయిని చూసి వారు సార్ ఓ చిన్న అమ్మాయి ట్యాంకర్ లారీ నడుపుతోంది అంటూ తమ పై అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత అన్ని అనుమతి పత్రాలు చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. అమ్మాయి అయినప్పటికీ నిబ్బరంగా లారీ నడుపుతున్న చూసి అధికారులు సైతం ఆమెను అభినందించారు తొలుత టూవీలర్ నేర్చుకున్న ఆమె ఆ తర్వాత ఫోర్ వీలర్ డ్రైవింగ్ ఆవాహనం చేసుకుంది. శ్రద్ధగా నేర్చుకుంది. కేరళ రాష్ట్రంలో వెలుగు వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: