దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది.  కరోనా వైరస్ క్రమక్రమంగా రూపాంతరం చెందుతూ భారత్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఇక వైరస్ ను ఎదుర్కోవడంలో టీకా కీలకం గా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ఒకప్పుడు కరోనా వైరస్ వచ్చిన సమయంలో వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన జనాలు ఇక ఇప్పుడు వ్యాక్సిన్లను ఉచితంగా ఇస్తాము అంటున్నా కూడా తీసుకోవడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.  వ్యాక్సిన్ విషయంలో అటు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు.. మరోవైపు సోషల్ మీడియాలో ఆకతాయిలు ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలు  కాస్త ప్రజల్లో వ్యాక్సిన్ అంటే భయాన్ని పెంచుతున్నాయి.



 దీంతో ఒకప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ఎంత ఖర్చయినా తీసుకోవాలని భావించిన జనాలు.. ఇప్పుడు ఉచితంగా ఇస్తామని చెప్పినా కూడా టీకా వేసుకోవడానికి భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతంగా కొనసాగించేందుకు.. అందరిలో టీకా పై అవగాహన పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి.  ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజానీకానికి వ్యాక్సిన్ పై మరింత అవగాహన పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.



 ఏకంగా ప్రజలందరికీ టీకా పై మరింత అవగాహన పెంచే విధంగా ఒక షార్ట్ ఫిలిం రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.  ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి నటుడిగా కొనసాగుతున్న దగ్గుబాటి రానా తో ఈ షార్ట్ ఫిలిం తీయాలని ప్లాన్ చేస్తుందట తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ షార్ట్ ఫిలిం లో వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. వేసుకోకపోవడం వల్ల జరిగే అనర్ధాలు తెలియజేస్తూ ..  టీకా విషయంలో ప్రజలందరిలో ఉన్న అపోహలు, అనుమానాలు అన్నింటినీ తొలగించే విధంగా ఈ షార్ట్ ఫిలిం రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: