టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్ లు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆ తర్వాత తమ వ్యక్తిగత జీవితాలకు వెళ్ళిపోయారు. చేసినన్ని రోజులు సినిమాలు చేసి డబ్బు సంపాదించి ప్రేక్షకులను అలరించి ఆ తరువాత తమ వైవాహిక జీవితంలో ఎంతో సుఖంగా జీవిస్తున్నారు. అలాంటి భారతీయ నటీమణులలో ఒకరు ఆసిన్. మళయాల సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆసిన్ తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అమ్మ నాన్నతమిళ అమ్మాయి చిత్రం ద్వారా పరిచయం అయింది.

చేసిన తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఆమె పై మన టాలీవుడ్ దర్శకులు కన్నుపడింది. ఆ వెంటనే పూరిజగన్నాథ్ తన తదుపరి చిత్రం శివమణి లో మళ్లీ అవకాశం ఇచ్చాడు. లక్ష్మీ నరసింహ, ఘర్షణ, చక్రం, అన్నవరం వంటి సినిమాలతో ఆమె అగ్ర కథానాయికగా అవతరించింది. ఓవైపు తెలుగు సినిమాల్లో చేస్తునే ఆమె తమిళ ఇండస్ట్రీ పై కూడా శ్రద్ధ వహించింది. దాని ఫలితంగా  తన కెరీర్ లోనే ఇండస్ట్రీ హిట్ గా ఉన్న గజిని సినిమా దక్కింది. ఆ సినిమా ద్వారా ఆమె సౌత్ ఇండియా లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది.

అదే సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయడంతో ఆమె క్రేజ్ దేశవ్యాప్తంగా విస్తరించింది. వరుసగా బాలీవుడ్ అవకాశాలు కూడా రావడం మొదలుపెట్టాయి. అక్కడ ఓ మోస్తరు హీరోయిన్ గా రాణించిన ఆమె తన కెరియర్ మంచి దూకుడు మీద ఉండగానే పెళ్లి చేసుకుంది. 2016వ సంవత్సరంలో ఆమె రాహుల్ శర్మ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఓ చిన్నారి కూడా ఉంది ఆమె పేరు అరిన్. నిరంతరం ఆసిన్ తన చిన్నారి అయిన ఆరిన్ కు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకునేది. తాజాగా ఆసిన్ కుమార్తెకు సంబంధించిన ఓ ఫోటో షేర్ చేయగా అందులో ఉన్న అరిన్ ను చూసి అప్పుడే ఆసిన్ కూతురు ఇంత పెద్దది అయిపోయిందా అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: