లగాన్ మరియు గద్దర్ చిత్రాలు రిలీజ్ అయి నేటికి సరిగ్గా ఇరవై ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా ఈ సంతోషకరమైన విషయాన్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఫణి కందుకూరి. ఆయన చేసిన పోస్ట్ లో ఈ సినిమాల గురించి ఈ విధంగా తాన భావాలను వ్యక్తపరిచారు. గద్దర్ మరియు లగాన్ చిత్రాలు రెండూ వేటికవే చాలా మంచి చిత్రాలను కొనియాడారు. ఈ రెండు సినిమాలు ఇదే రోజున 20 ఏళ్ల క్రితం విడుదలయ్యాయి. నాకు సంబంధించి ఈ రెండు చిత్రాలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైనవి, రెండు సినిమాలు రెండు అద్భుతాలే అని తెలిపారు. ఈ రెండు చిత్రాలు  సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి. ఈ రెండు సినిమాల్లోనూ మాటలు, పాటలు, కథలు ఇప్పటికీ ప్రత్యేకమే. ఎప్పటికి ఈ ఆదరణ ఇలాగే కొనసాగుతుంది అని అనుకుంటున్నాను అంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఫణి.
ఇక లగాన్ మరియు గద్దర్ సినిమాల విషయానికి వస్తే రెండు సినిమాలు కూడా అప్పట్లో సంచలనం సృష్టించిన చిత్రాలే.  లగాన్ సినిమా జూన్ 15 2001 లో విడుదల అయింది. లగాన్ సినిమా లో బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ హీరోగా నటించారు. అదే విధంగా  ఈ సినిమాను స్వయంగా అమీరే నిర్వహించడం ద్వారా విశేషం. అశుతోష్ గోవార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఓ ప్రభంజనం అనే చెప్పాలి. ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరింత ప్లస్ గా మారింది. ప్రతి పాట మనసుకి ఒక అందమైన అనుభూతిని ఇస్తుంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే, బ్రిటీషు పరిపాలిస్తున్న సమయంలో భూమి పన్నుకు  వ్యతిరేకతను తెలియచేసేందుకు ఓ గ్రామ ప్రజలు క్రికెట్ ఆడటానికి నిర్ణయించుకుంటారు. కానీ అది వారికి అలవాటు లేని ఆట అవగాహన లేని క్రీడ. కానీ బ్రిటిష్ వారి పన్ను భారం తగ్గాలంటే ఎలాగైనా  ఆడి విజయం సాధించాల్సిందే. కానీ చివరికి ఆమీర్ ఖాన్ నేతృత్వంలో ఆడి గెలుస్తారు. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రతి ఒక్క సన్నివేశం భారతీయుడి దేశభక్తిని చాటి చెప్పింది.  

ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా ఈ సినిమా తెరకెక్కింది. ఈ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సినీ చరిత్రలో ఒక మైలు రాయి. అంతే కాకుండా బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిత్రంగా  క్రెడిట్ సంపాదించుకుంది. ఇక లగాన్ సినిమా రోజున విడుదలైన మరో చిత్రం గద్దర్ ఏక్ ప్రేమ్ కథ, ఈ మూవీ కూడా లగాన్ సినిమాకు పోటీగా బాక్సాఫీస్ వద్ద విజయం అందుకొని కాసుల వర్షం కురిపించడంలో పోటా పోటీగా నిలిచింది. అనిల్ శర్మ డైరెక్షన్ లో సన్నీ డియోల్ , అమీషా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కథ, మాటలు, పాటలు, ఉత్తమ్ సింగ్ అందించిన సంగీతం ఇలా ప్రతిదీ ప్రత్యేకమైన ఆదరణ అందుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ చిత్రం బాలీవుడ్ చలన చిత్ర సీమలో ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఇలా ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచి సంచలనం సృష్టించాయి. ఈ సందర్భంగా ఈ రెండు సినిమాలను ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ధన్యవాదములు. మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి ఒక మంచి ఉదాహరణగా నిలిచాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: