ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని ప్రతి సంవత్సరం స్టార్ సెలబ్రెటీల ఫోటోలతో క్యాలెండర్‌ విడుదల చేస్తారు. అయితే '2021 డబూ రత్నాని క్యాలెండర్‌'లో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ఇప్పటికే క్యాలెండర్ కి సంబంధించి ఆయన ఫోటో షూట్ కూడా పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబూ రత్నాని, విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో ముచ్చటించారు. ఈ సంభాషణలో విజయ్ దేవరకొండ అడిగిన ప్రశ్నలు.. ఇచ్చిన సమాధానాలు గమనిస్తే అతను మన లాంటివారేనని స్పష్టమవుతోంది. అవేంటో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

1. విజయ్ పిల్లలని పలకరించడం.

డబూ రత్నాని పిల్లలతో విజయ్ ముచ్చటించారు. హాయ్ అంటూ పిల్లలని పలకరించిన తర్వాత వారి చదువుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఒక సెలబ్రిటీ తన లైవ్ సెషన్ లో మిగతా అన్ని విషయాలు పక్కనపెట్టి చదువు గురించి అడగటం నిజంగా ఒక గొప్ప విషయమేనని చెప్పుకోవచ్చు. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు.. సినిమాల గురించి ప్రశ్నలు వేస్తారు. మీరు సినిమాలు చూస్తారా? చూస్తే ఎవరి సినిమాలు ఎక్కువగా చూస్తారు? మీ ఫేవరెట్ హీరో ఏంటి? జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వంటి విషయాల గురించి అడుగుతారు. కానీ విజయ్ దేవరకొండ వారి ఎగ్జామ్స్ గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. దీని బట్టి స్టార్డమ్ ఎంత వచ్చినా సరే.. మన అందరిలాగానే అత్యంత ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ విజయ్ దేవరకొండ తన జీవితాన్ని కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు.

2. అభిమానుల పట్ల అమితమైన ప్రేమ.

విజయ్ దేవరకొండ తన ఫోటో షూట్ గురించి డబూ రత్నాని అడిగేందుకు మాత్రమే ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చారు. ఆ సమయంలో 40 వేల మందికి పైగా అభిమానులు కామెంట్ బాక్స్ ని ప్రశ్నలు, పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే ఇది గమనించిన విజయ్.. "అభిమానులు ప్రశ్నలకు సమాధానం చెబుదామా.. ఎందుకంటే నేను ఇన్ స్టాగ్రామ్ లైవ్ ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు మీతో నేను డైరెక్ట్ గా మాట్లాడకుండా వెళ్ళిపోతే నాకు బాధగా అనిపిస్తుంది," అని అన్నారు. సాధారణంగా సెలబ్రిటీలు ఇతర సెలబ్రిటీలతో మాట్లాడేందుకు లైవ్ లోకి వస్తే వారితో మాట్లాడి ఫాన్స్ ప్రశ్నలను పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. కానీ విజయ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి ఆశ్చర్యపరిచారు.

3. స్టార్ అనే పొగరు విజయ్ కి లేదు.

విజయ్ దేవరకొండకి ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన విజయ్ డియర్ కామ్రేడ్ సినిమాతో కూడా భారత దేశ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించారు. అయితే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆయన ఏమాత్రం పొగరు చూపించరు. తాజాగా జరిగిన లైవ్ సెషన్ లో డబూ రత్నాని విజయ్ హెయిర్ స్టైల్ ని బాగా పొగిడారు. 'ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా వచ్చిన లుక్ ఇది. ఈ లుక్ రావాలంటే 30 సెకండ్లు చాలు' అని విజయ్ అన్నారు. దీన్ని బట్టి ఆయన తన గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడరని అర్ధమయ్యింది. ఇక ఆయన తన స్టార్ డమ్ పక్కనపెట్టి షారుక్ ఖాన్ తనకు ఇష్టమైన హీరో అని.. అతని నటనను ఎప్పుడూ తాను ప్రశంసించేవాడినని ఆయన చెప్పుకొచ్చారు.

4. విజయ్ దేవరకొండ కి చాలా సిగ్గు ఎక్కువ.

సినిమా ఈవెంట్స్ లలో చాలా ధైర్యం గా మాట్లాడే విజయ్ కి చాలా సిగ్గు ఎక్కువట. ఈ విషయాన్ని ఆయన లైవ్ లో వెల్లడించారు. క్యాలెండర్ లాంచ్ పార్టీ గురించి ఆయన మాట్లాడుతూ "వర్చువల్ లాంచ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. నాకు చాలా సిగ్గు ఎక్కువ. పార్టీ లలో బాగా ఇబ్బంది పడిపోతా," అని చెప్పుకొచ్చారు.

5. విజయ్ దేవరకొండ చాలా కూల్.

అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ సినిమాలలో చాలా కోపిష్టిగా కనిపించారు కానీ నిజ జీవితంలో శాంతంగా ఉంటారని తెలుస్తోంది. తాజాగా జరిగిన లైవ్ సెషన్ లో ఆయన ఏ సందర్భంలోనూ సీరియస్ లుక్ ఇవ్వలేదు. చాలా సంతోషంగా నవ్వుతూ ఆయన మాట్లాడారు. ఇక ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆయన మనందరిలాగే చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: