యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కృష్ణం రాజు వారసుడు గా సినిమాల లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే యూత్ లో మంచి t టాక్ ను అందుకున్నారు. తన స్టయిల్, డైలాగులు చెప్పడం మొత్తం యువతను బాగా ఆకట్టుకున్నాయి.. ఆ తర్వాత వచ్చిన ఒక్కో సినిమా లో ఒక్కో విధమైన లుక్ కనిపించి అభిమానులకు డార్లింగ్ అయ్యాడు.. మొదటి నుంచి ప్రభాస్ యాక్షన్ సన్నీవేశాల్లో నటిస్తున్నాడు. మున్నా, బుజ్జిగాడు, రెబల్ , ఏక్ నిరంజన్, చత్రఫతి సినిమాలు ఒక ఎత్తైతే ఆ తర్వాత వ‌చ్చిన మిర్చి ఒక ఎత్తు..

ఈ సినిమాను కొరటాల శివ రూపొందించారు.. ప్రభాస్, అనుష్క, రిచా హీరో, హీరోయిన్లు గా నటించారు.. యాక్షన్ డ్రామా గా ఈ సినిమా కథ ఉంటుంది.. దేవా, లత  ఏకైక సంతానం జై ,దేవా సొంత ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. తన ఊరి ప్రజల కోసం దేవా అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జైని తీసుకుని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకుని తండ్రి దగ్గరికి వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల  ప్రేమని గెలుచుకుంటాడు.

ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ వూరికి జై వల్ల మళ్లీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్ళి నిశ్చయమై పెళ్ళి జరుగుతున్న సమయంలో దేవాకి సంబంధించిన శత్రువులు రాజయ్య  మనుషులు దేవా కుటుంబం మీద కాపు కాశీ దాడి చేస్తారు. ఈ గొడవల్లో లత హత్యకు గురై చనిపొతుంది.. ఆ గొడవకు కారణం కొడుకే అని తెలుసుకొని ఇంటి నుంచి బయటకు పంపేస్తాడు.. తన తండ్రి కోరిక మేరకు ప్రేమ తో అందరినీ మార్చి రెండు కుటుంబాలను ఒకటి చేసి, అనుష్క ను పెళ్ళి చేసుకుంటాడు.. అలా సినిమాకు ముగింపు పలుకుతారు.. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా చిత్రం అయిన బాహుబలి సినిమా లో నటించాడు.. ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: