దేశంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది.  అయితే మొదటి దశ కరోనా వైరస్ నూ ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెకండ్ వేవ్ ప్రభావాన్ని అంచనా వేయలేకపోయాయ్. ఈ నేపథ్యంలో ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యే లోపే సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితులు తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత దాదాపు అన్ని రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాలలో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం సెకండ్ వేవ్ ప్రభావం కాస్త దేశంలో కాస్త తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఢిల్లీ సహా తెలుగు రాష్ట్రాలలో కూడా  వైరస్ ప్రభావం తీవ్రంగా చూపించింది. కొన్ని రోజుల పాటు ప్రమాదకర రీతిలో కేసులు వెలుగులోకి వచ్చాయి.



 అయితే దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ కూడా  పేద ప్రజల పరిస్థితి దుర్భరంగా మారిపోయింది.  అదే సమయంలో అటు ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో కరోనా సమయంలో బయటపడింది. అయితే కరోనా కష్టకాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ప్రజలకు అండగా నిలిచి అటు ఇది ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఇటీవలే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా బాధితులు ఆదుకోవడం కోసం తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షల రూపాయలను అందించారు విజయ్ సేతుపతి.



 తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ను ఆయన కార్యాలయంలో కలిసి ఇక 25 లక్షల రూపాయల చెక్కును సమర్పించారు  అయితే ఇక విజయ్ సేతుపతి ఇచ్చిన 25 లక్షల రూపాయలను ఆసుపత్రిలో కరోనా రోగులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇకపోతే ప్రస్తుతం విజయ్ సేతుపతి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. కేవలం తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్నారు  విజయ్ సేతుపతి.

మరింత సమాచారం తెలుసుకోండి: