సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు. మనుషులు చేసిన దొంగలు సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా రమేష్ బాబు తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నీడ, పాలు నీళ్లు సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. ఇక ఆ తర్వాత 1987 లో సామ్రాట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 12 సినిమాల్లో హీరోగా నటించిన రమేష్ బాబు హీరోగా స్టార్ డం తెచ్చుకోవడంలో వెనకపడ్డాడు.

కృష్ణ నట వారసుడిగా రమేష్ బాబు పెద్ద స్టార్ అవుతాడని అనుకోగా ఆయన మాత్రం హీరోగా నటించినా ఘట్టమనేని అభిమానుల నుండి పెద్దగా ఇంప్యాక్ట్ క్రియేట్ చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలో రమేష్ ను పక్కన పెట్టి చిన్న అబ్బాయి మహేష్ మీద ఫోకస్ పెట్టారు కృష్ణ. మహేష్ లోని చురుకుదనం చూసి అతను పెద్ద స్టార్ అవుతాడని అనుకున్నారు. అందుకే మహేష్ ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మహేష్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టాడు. మహేష్ బాబు మొదటి సినిమా నీడ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వత దాదాపు ఏడు సినిమాల దాకా మహేష్ బాల నటుడిగా నటించి మెప్పించారు.

మహేష్ బాబు హీరోగా రాజకుమారుడు సినిమాతో మెప్పించాడు. అప్పటి నుండి ఆయన కెరియర్ గురించి అందరికి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడు పెద్ద కొడుకు రమేష్ అవుతాడని అనుకోగా బాల నటుడిగా మెప్పించి రాజకుమారుడిగా ప్రేక్షకులను రంజింప చేసి మురారిగా మెప్పించి యువరాజుగా మనసులు గెలిచి పోకిరిగా అందరి మన్నలను పొంది.. సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నాడు మహేష్.  సూపర్ స్టార్ కృష్ణ కు సరైన వారసుడిగా వెండితెర మీద ఆ నట శేఖరుడి విజృంభనని కొనసాగిస్తూ మహేష్ ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: