ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ లో బయోపిక్ ల హవా నడుస్తోంది  ఎంతో మంది సినీ ప్రముఖుల జీవిత కథలను సినిమాలుగా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినీ ప్రముఖుల జీవితానికి సంబంధించి ఎన్నో తెలియని విషయాలను కూడా సినిమాల ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు దర్శక నిర్మాతలు  అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది సినిమా ప్రముఖుల బయోపిక్ లు తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.  మహానటి సావిత్రి బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. ఇక ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులుగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.



 ఇలా ఎంతో మంది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు బయోపిక్ లు తెరకెక్కగా ఇక మరికొంతమంది బయోపిక్ లు త్వరలో తెరకెక్క బోతున్నట్లు  గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.  ఎన్నో దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు నటుడిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎంతగానో సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు జాతి మొత్తం గర్వించదగ్గ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం  అనారోగ్యం బారిన పడి కన్నుమూశారు. అయితే ఆయన భౌతికంగా అందరికీ దూరమైనప్పటికీ అందరి మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయారు.



  అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో ఏళ్ల పాటు ఎనలేని సేవలు అందించిన ఎస్పి బాలసుబ్రమణ్యం బయోపిక్ తెరకెక్కించేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బాలు కుమారుడు చరణ్ దర్శకుడు సురేందర్ రెడ్డి ని  బాలు బయోపిక్ కి సంబంధించి తెరకెక్కించాలని అడిగినట్లు  సమాచారం. అయితే తన తండ్రి పాత్రలో నటించడానికి బాలీవుడ్ హీరో అయితే బాగుంటుందని బాలు తనయుడు చరణ్ భావిస్తున్నారట.. అయితే ఇక బాలీవుడ్ హీరోల్లో ఎవరు ని సెలెక్ట్ చేయాలనే దానిపై ప్రస్తుతం దర్శకుడు సురేందర్ రెడ్డి తో చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: