అనన్య నాగ‌ల్ల‌ ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే సినిమా మల్లేశం. ఎందుకంటే చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కిన మల్లేశం చిత్రంతోనే అనన్య టాలీవుడ్ కు ప‌రిచ‌యమైంది. ఈ సినిమాలో  ఒక పల్లెటూరి అమ్మాయిలా న‌టించి విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే ఈ సినిమాతో గుర్తింపు వ‌చ్చిన‌ప్ప‌టికీ అనన్య దాదాపు రెండు సంవత్సరాల పాటు అవ‌కాశాలు లేక కాళీగానే ఉంది. ఆ తర్వాత వరుసగా ప్లే బ్యాక్, వకీల్ సాబ్ చిత్రాలలో నటించింది. వ‌కీల్ సాబ్ సినిమాలో అన‌న్య పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోయిన‌ప్ప‌టికీ ప‌వ‌ర్ స్టార్ సినిమా కావ‌డంతో తెగ పాపులారిటీని సంపాదించుకుంది. 

అయితే అప్ప‌టికే అన‌న్య ప్లే బ్యాక్ అనే సినిమా కూడా చేసింది కానీ ఈ సినిమా థియేటర్ లో పెద్దగా ప్రభావం చూపకపోయింది. కానీ ఈ మధ్య కాలంలోనే ఒక ప్రముఖ ఓటీటీలో విడుదలై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ అనన్య చేసిన‌ పాత్రలు అన్నీ దాదాపు సహజసిద్ధమైన పాత్రలే. దాంతో ఈ అమ్మడి అందాల ఆర‌బోతకు అవ‌కాశం ద‌క్క‌లేదు. అంతే కాకుండా ఎంచుకున్న సినిమాల్లోనూ అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఛాన్స్ లేదు. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం అన‌న్య హాట్ ఫోటోల‌తో సెగ‌లు రేపుతోంది. రోజూ కొత్త కొత్త వీడియోలు, ఫోటో షూట్ ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. క‌చ్చితంగా ప్ర‌తి రోజూ ఓ ఫోటోను అభిమానుల ముందుకు తీసుకువ‌స్తుంది. ముఖ్యంగా న‌డుమందాల‌ను ఎర‌గా వేస్తూ అన‌న్య సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా అన‌న్య ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో అన‌న్య హాట్ హాట్ ఫోజుల‌తో రెచ్చిపోయింది. బ్లూకలర్ డ్రెస్ లో వయ్యారాలు వలకపోసింది. నాభి అందాలు చూపిస్తూ కుర్రాళ్ళ మతి పోగొట్టింది. మబ్బులు వచ్చినప్పుడు నెమలి చేసే నాట్యంలా నడుము చూపిస్తూ ఫోజులు ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో అనన్య అందాల షోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా అనన్య ఈ రేంజ్ లో వయ్యారాలు వలకబోయాడానికి కారణం తాను గ్లామర్ పాత్రలు సైతం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని డైరెక్టర్ లకు హింట్ ఇవ్వటమే. మరి అనన్య కు గ్లామర్ పాత్రల్లో నటించేందుకు అవకాశాలు వస్తాయా లేదా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: