ప్రస్తుతం బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల చిత్రీకరణలు ఎక్కువ అవుతున్నాయి. హీరోయిన్లు కూడా హీరోలకు సమానంగా మార్కెట్ ను తెచ్చుకోవడంతో ఆ తరహా సినిమాలు తెరకెక్కడం ఎక్కువవుతున్నాయి. బడ్జెట్ ను సైతం లెక్క చేయకుండా హీరోయిన్లను ప్రధాన పాత్రలో పెట్టి సినిమాలు చేస్తున్న నిర్మాతలు. మరి ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం. వివాదాలతో పాటు విభిన్న పాత్రలకు చిరునామాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తలైవి. ఈ తరహా సినిమాలలో మంచి క్రేజ్ ఉన్న చిత్రంగా చెప్పొచ్చు తలైవి. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విజయ్ దర్శకత్వం వహిస్తుండగా తమిళ తెలుగు హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. 65 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. కధా బలం ఉన్న వాటికి ప్రాధాన్యం ఇచ్చే నాయికగా బాలీవుడ్ లో విద్యాబాలన్ కు మంచి పేరు ఉంది ఆమె షేర్నీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 18న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది ఈ సినిమా. 

ఆలియా భట్ విభిన్న పాత్రల పై త్వరగానే దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలోనే ఆమె కథియవాడ గంగుభాయ్ నిజ జీవితం ఆధారంగా ఓ సినిమా చేస్తుంది. గత్యంతరం లే క వ్యభిచారంలోకి అడుగుపెట్టి ఎక్కడినుంచి గంగు భాయ్ గా ఎలా ఎదిగింది అన్నది ఈ సినిమా కథ. మహిళా ప్రాధాన్యమున్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ. ఆమె క్రీడల నేపథ్యంలో రెండు సినిమా లు తెరపైకి రానున్నాయి. మిథాలీ రాజ్ జీవిత నేపద్యంలో శభాష్ మిథూ.. స్ప్రింటర్ రష్మీ బయోపిక్  రష్మీ రాకెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: