టాలీవుడ్ లో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాల గురించి మాట్లాడుకుంటే అన్నిటికంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చే సినిమా సమరసింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ సినిమాల దర్శకుడు బి గోపాల్ తీసిన ఈ సినిమాని సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చెంగల వెంకట్ రావు నిర్మించారు. 1999లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుంది.
అంజలా ఝవేరి, సిమ్రాన్ కథానాయికలుగా యాక్ట్ చేసిన ఈ సినిమాకి మణిశర్మ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఈ మూవీలో బాలకృష్ణ పలికిన పవర్ఫుల్ డైలాగ్స్ అదుర్స్ అనే చెప్పాలి. ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన జయప్రకాశ్ రెడ్డి తన సహజత్వ నటనతో అందరి నుండి మంచి పేరు దక్కించుకున్నారు. అప్పట్లో ఫ్యామిలీ, లవ్ ఎమోషనల్ సినిమాలు ఎక్కువగా నడుస్తుండగా తొలిసారిగా ఈ ఫ్యాక్షన్ బేస్డ్ యాక్షన్ స్టోరీ తో డేరింగ్ స్టెప్ వేశారు బాలకృష్ణ.
నిజానికి ఈ సినిమా కోసం ముందుగా 25 నుండి 30 కథల వరకు రాసుకున్న రచయితలు పరుచూరి బ్రదర్స్, ఆ తరువాత విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథకు ఓటేశారు. ఆపై దానిని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్ది ఫైనల్ గా భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమా 104 సెంటర్స్ లో 100 రోజులు, 22 సెంటర్స్ లో 175 రోజులు నడిచి సరికొత్త రికార్డు ని సృష్టించింది. అప్పట్లో ఈ మూవీ సాంగ్స్ క్యాసెట్స్ అత్యధికంగా అమ్ముడై కొత్త ప్రభంజనాన్ని సృష్టించాయి. మొత్తంగా ఫ్యాక్షన్ మూవీగా తెరకెక్కిన సమరసింహారెడ్డి మూవీ బాలయ్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచిపోతుంది అని చెప్పవచ్చు.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: