టాలీవుడ్ లోని హీరో,దర్శకుడి బెస్ట్ కాంబినేషన్స్ లో బాలకృష్ణ, బి గోపాల్ ల కాంబో కూడా ఒకటి అనే చెప్పాలి. తన కెరీర్ లో బాలకృష్ణ తో చాలా సినిమాలు చేసిన బి గోపాల్ ఆల్మోస్ట్ ఎక్కువగా విజయాలనే అందుకున్నారు. ఇక వీరిద్దరి కలయికలో వచ్చిన అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ మూవీ నరసింహనాయుడు. ఈ మూవీ దాదాపుగా విడుదలైన అనేక కేంద్రాల్లో భారీ కలెక్షన్ దక్కించుకుంది. సిమ్రాన్ కథానాయికగా యాక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రీతీ జింగ్యానీ మరొక హీరోయిన్ గా నటించింది.
ఆశాషైనీ, ముఖేష్ రుషి, కె విశ్వనాధ్, బ్రహ్మానందం, చలపతి రావు తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ సినిమాని మేడికొండ వెంకట మురళీకృష్ణ ఎంతో భారీగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిజంగా అదరహో అనే చెప్పాలి. ముఖ్యంగా ఫ్యాక్షన్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా నిలిచి 2001లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన నరసింహనాయుడు మూవీ అతి పెద్ద విజయాన్ని అందుకోవడంతో పాటు అప్పట్లో గుంటూరు లోని కృష్ణమహల్ థియేటర్ లో 100 రోజలు 4 ఆటలు హౌస్ ఫుల్ తో ప్రదర్షింపబడి సరికొత్త రికార్డు ని సృష్టించింది. ఇక ఈ మూవీలో బాలకృష్ణ నటన, అదిరిపోయే డైలాగ్స్, సుమో ఛేజింగ్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు మరీ ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ వంటి వాటి గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి.
ప్రారంభ సీన్ నుండి క్లైమాక్స్ సీన్ వరకు ఆడియన్స్ ని సీట్ నుండి కదల నివ్వకుండా కట్టిపడేసేలా ఎంతో అద్భుతంగా ఈ మూవీని తెరకెక్కించారు బి గోపాల్. ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ కథ అందించిన ఈ సినిమాకి సీనియర్ ఫోటోగ్రాఫర్ వి ఎస్ ఆర్ స్వామి కెమెరా మ్యాన్ గా వ్యవహరించారు. అప్పట్లో అత్యధికంగా రూ.29 కోట్ల షేర్ సాధించిన ఈ మూవీ ద్వారా ఉత్తమనటుడుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డు అందుకున్నారు బాలకృష్ణ. ఆ ఏడాది సంక్రాంతి బరిలో బాలకృష్ణ నరసింహనాయుడు, మెగాస్టార్ చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవిపుత్రుడు మూవీస్ నిలవగా వాటిలో నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి చరిత్ర తిరగరాయడం విశేషం ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: