బాహుబలి సినిమాతో రెబల్ స్టార్ స్టేటస్ నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతేకాకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తన పాన్ ఇండియా స్టేటస్ భారీ బడ్జెట్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌లా మారాడు. బాహుబలితో భారీ కలెక్షన్లు అందుకున్న ప్రభాస్ ఆ తరువాత భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో మంచి రెస్పాన్స్ అందుకున్న ప్రభాస్ వరుస సినిమాలను ఓకే చేశాడు. వాటిలో ఒకటి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్‌తో చేయనున్నాడు. కానీ ఆ సినిమా లేట్ అవుతుండటంతో ఈ గ్యాప్‌లో మరో మూడు సినిమాలను ఓకే చేశాడు. వాటిలో జిల్ ఫేమ్ రాధాకృష్ణతో ‘రాధేశ్యామ్’ సినిమా పూర్తి కూడా చేశాడు. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాను చేస్తున్నాడు. అదే విధంగా బాలీవుడ్ దర్శకుడితో ‘ఆదిపురుష్’లోనూ నటిస్తున్నాడు.


ప్రస్తుతం ఆదిపురుష్ నుంచి కాస్త గ్యాప్ రావడంతో సలార్‌పై దృష్టి పెట్టాడు. అయితే తాజాగా సలార్ సినిమాలో ఓ కీలక అంశం గురించి వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. దాంతో పాటుగా ఆ వార్త నిజమనే విధంగా సినీ సర్కిల్స్‌లా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అదేంటనుకుంటున్నారా.. పక్కా యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ‘సలార్‌’లో ప్రభాస్ ఎడమ చేతి చూపుడు వేలు వంగిపోయి కనిపిస్తుందట. అంతేకాకుండా ఈ సినిమాలో ఆ వేలు చాలా కీలకమని కూడా టాక్ వినిపిస్తోంది. దీంతో అసలు ఆ వేలు కథేంటని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. కానీ అది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.



ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన క్రాక్ గర్ల్ శ్రుతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ దాదాపు పూర్తయిందట. మరికొన్ని రోజుల్లో రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతుందని సమాచారం. అందులో ప్రభాస్ సెకండ్ గెటప్‌లోని సన్నివేశాలు చిత్రీకరించనున్నారని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఈ షెడ్యూల్‌లోని కొన్ని భారీ యాక్షన్ సీన్‌లు కూడా ఉండనున్నాయట. ఈ మేరకు వార్తలు తెగ వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: