టాలీవుడ్ హీరోలు ఇతర భాషల్లోకి ఎంట్రీ ఇచ్చి మార్కెట్ పెంచుకుంటున్నారు. పక్కనున్న కోలీవుడ్ తో పాటు శాండల్ వుడ్ వరకూ తమ సినిమాలను తీసుకెళ్తూ సత్తా చాటుతున్నారు. ఇపుడు ఏకంగా పాన్ ఇండియా మూవీస్ అంటున్నారు. ఇలా టాలీవుడ్ లోని టాప్ హీరోలు సందడి చేస్తున్నారు.

మరో వైపు చూసుకుంటే కోలీవుడ్ హీరోలు ఇపుడు టాలీవుడ్ వైపు చూస్తున్నారు. పెద్ద మార్కెట్ గా ఉన్న టాలీవుడ్ లో పాగా వేయడానికి వారు ఉత్సాపడుతున్నారు. దాదాపుగా రెండు దశాబ్దాలుగా టాప్ హీరోగా కొనసాగుతున్న తమిళ నటుడు సూర్య చాన్స్ వస్తే చాలు తాను తెలుగులో నటిస్తాను అంటూ ఉంటారు. ఇపుడు ఆ టైమ్ వచ్చిందట.

సూర్యాకు తెలుగులో మంచి ఆదరణ ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయితే మంచి సక్సెస్ అందుకుంటాయి.  అలాంటి సూర్యాకు ఇపుడు తెలుగులో సరైన బ్యానర్, డైరెక్టర్ దొరికారుట. తెలుగులో అందరు హీరోలతో సినిమాలు తీసిన దిల్ రాజు తన బ్యానర్ మీద సూర్యతో ఒక సినిమా తీయనున్నారని అంటున్నారు. ఈ మూవీకి ఊర మాస్ డైరెక్టర్ గా ముద్రపడిన బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారు అంటున్నారు.

ప్రస్తుతం బాలయ్యతో అఖండ మూవీ తీస్తున్న బోయపాటి మరి కొద్ది నెలలలో ఖాళీ అయిపోతారు. ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయని అంటున్నారు. అందులో ఒకటి అల్లు అర్జున్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద సినిమాట. మరోటి సూర్యతో మూవీట. ఈ రెండింటిలో సూర్య మూవీయే ముందు స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఎందుకంటే పుష్ప టూ కూడా ముగించుకుని అల్లు అర్జున్ ఫ్రీ అయితేనే బోయపాటి మూవీ ఉంటుంది. ఈ గ్యాప్ లోగా సూర్యా మూవీని పట్టాలెక్కించాలని బోయపాటి అనుకుంటే స్ట్రైట్ మూవీతో సూర్య తెలుగులో పక్కా మాస్ హీరోగా దర్శనమిస్తాడన్న మాట.  చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: