నందమూరి వంశంలో పుట్టిన మరో ఆణిముత్యం జూనియర్ ఎన్టీఆర్. అచ్చం స్వర్గీయ నందమూరి తారకరామారావు లాగా ఉండడం వలన చిన్నప్పటి నుండి రామారావు గారికి ఎన్టీఆర్ అంటే చెప్పలేని ప్రేమ. అలా ఆయన పెంపకంలోనే ఎక్కువగా పెరిగిన ఎన్టీఆర్ చాలా వరకు తాత లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడు. స్వర్గీయ ఎన్టీఆర్ కి ఎలాగయితే అభిమాన గణం ఉన్నారో, ఎన్టీఆర్ కి కూడా అదే స్థాయిలో అభిమానులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఎన్టీఆర్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో ఒక అయిదు విషయాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము.

* ఎన్టీఆర్ పది సంవత్సరాల వయసులోనే ముఖానికి రంగేసుకున్నాడు. తన తాత దర్శకత్వం వహించిన "బ్రహ్మర్షి విశ్వామిత్ర" అనే సినిమాలో నటించారు. ఆ తరువాత "బాలరామాయణం" లోనూ రాముని పాత్రలో నటించి అందరి చేత ప్రశంశలనందుకున్నాడు. ఈ సినిమాలో తన నటనకు గానూ "యువకళావాహిని" అనే అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు.
* ఎన్టీఆర్ కు డాన్స్ అంటే మహా ఇష్టం. ఎన్టీఆర్ కూచిపూడిలో ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఇప్పడున్న టాలీవుడ్ హీరోలలో డాన్సులో ఎన్టీఆర్ టాప్ లో ఉంటాడు.
* ప్రతి ఒక్కరికీ లక్కీ నంబర్ అంటూ ఒకటి ఉంటుంది. ఈ విషయంలో చాలా మంది సెంటిమెంట్ గా ఉంటారు. వారు వాడే కార్లు, బైక్ లకు ఈ నంబర్ లు వచ్చే లాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అదే విధంగా ఎన్టీఆర్ కు కూడా ఒక అదృష్ట సంఖ్య ఉంది. ఎన్టీఆర్ కు 9 లక్కీ నంబర్. ఈయనకున్న కార్లు అన్నింటికీ 9999 నంబర్ ఉంటుంది.
* ఎన్టీఆర్ హీరోగా మారాక "నిన్ను చూడాలని" తన మొదటి సినిమా అయినప్పటికీ, రాజమౌళి డైరెక్ట్ చేసిన "స్టూడెంట్ నంబర్ 1" సినిమాతోనే ఎన్టీఆర్ కు హిట్ దక్కింది.
* వీటన్నింటికన్నా ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఈ రోజుకి కూడా కోట్లాదిమంది తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ కు రాజకీయాలు అంటే అంతగా ఇష్టం లేనట్లే ఉంది. అందుకే ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండడం మనము చూస్తూనే ఉన్నాము.
ఇవే ఎన్టీఆర్ గురించి చాలా మందికి తెలియని అంశాలు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" మూవీలో కొమరం భీం అనే పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా కొంత షూటింగ్ పెండింగ్ పడినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ దసరాకే ఈ సినిమా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: