టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలను సైన్ చేసుకుంటూ వెళ్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తున్న ఈ భామ..తాజాగా నాగార్జున సరసన ఓ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమాలో కాజల్ మునుపెన్నడూ లేని విధంగా కనిపించనుందట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కాజల్ రెండు షేడ్స్ ఉండే పాత్రలో నటించనుందట. అందులో ఒకటి వేశ్య పాత్ర అని తెలుస్తోంది.

 గతంలో కాజల్ ఇలాంటి పాత్రలో నటించలేదు. అది కూడా ఇప్పుడు పెళ్లి తర్వాత ఒక వేశ్య పాత్రలో నటించడానికి ఒకే చెప్పడం ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది.కథ ప్రకారం మరో పాత్రలో ఒక స్పై గా కూడా కనిపించనుదట కాజల్. ఇక ఈ సినిమాలో నాగార్జున కి పూర్తి స్థాయిలో సహకరం అందిచే పాత్రలో కాజల్ కనబడుతుందని..తన అంద చందాలతో తీవ్రవాదులను ఆకట్టుకుంటూ..వారితో రొమాన్స్ చేస్తూ.. వారి యొక్క రహస్యాలను డిపార్ట్మెంట్ కి చేరవేస్తుందట..అంతేకాదు సినిమాలో పలు యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా పాల్గొననుందట ఈ భామ. దానికోసం ఇప్పటికే కసరత్తులు కూడా చేస్తోందట.

అయితే సినిమాలో ఎక్కువ భాగం కాజల్ వేశ్య గానే కనిపించనుంది.అయితే పెళ్లి తర్వాత కాజల్ కి ఇలాంటి పాత్రలు సెట్ అవ్వవని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే కాజల్ అగర్వాల్ మాత్రం కథ బాగా నచ్చి ఈ ప్రాజెక్ట్ ను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.ఇక సినిమాలో కాజల్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని చెప్తున్నారు.ఇక ఇప్పటివరకు కాజల్ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ లో నటించింది లేదు. అందుకే కచ్చితంగా ఈ సినిమాతో తాను ఛాలెంజింగ్ రోల్స్ లో సత్తా చాటాలని భావిస్తోంది.ఇక నాగార్జున,కాజల్ అగర్వాల్ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం మరో విశేషం.మరి కాజల్ కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: