చిత్ర పరిశ్రమలో మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఇండస్ట్రీకి మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో పరిచయమైయ్యారు. ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. అయినప్పటికీ తమన్నాకి వరుస అవకాశాలు రావడంతో తక్కువ సంయమలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. ఈ భామ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న హీరోలందరితో జతకట్టింది.

ఇక మధ్య కాలంలో సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న తమన్నా వెబ్ సిరీస్ లతో కూడా బిజీ మారిపోయింది. మిల్క్ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల నుండి అనుకునంతగా ఆదరణ పొందలేకపోయాయి. ఇక మరోవైపు బాహుబలి 2 తర్వాత తమన్నా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోలేదు.
 
అయితే కెరీర్ పరంగా ఆఫర్లతో బిజీగా ఉన్నా సక్సెస్ లేని తమన్నా త్వరలో ఒక వంటల కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. ఇక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ మాస్టర్ చెఫ్ తరహా షోను ప్లాన్ చేయగా ఆ షోకు తమన్నా హోస్టింగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. అంతేకాదు.. వంటల షో చేయడానికి తమన్నా సిద్ధం కావడంతో కొందరు నెటిజన్లు తమన్నా వంటలక్కగా మారబోతున్నారని సోషల్ మీడియాలో సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ కార్యక్రమంతో బుల్లితెరపై తమన్నా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాలి మరి. ఇక తమన్నా సినిమా ఆఫర్లు వస్తున్న సమయంలో వెబ్ సిరీస్ లకు, బుల్లితెరకు ప్రాధాన్యత ఇచ్చి తప్పు చేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమన్నా నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ట్రో సినిమాలో నెగిటివ్ రోల్ లో నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు సీటీమార్, ఎఫ్3 సినిమాల్లో తమన్నా నటిస్తుంది. ఇక ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు హిట్టైతే తమన్నాకు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: